రామయ్య vs రావేలా - టీడీపీ లో భారీ ముసలం !

KSK
తెలుగుదేశం పార్టీ పరువు రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులో దొరికిపోయి..హైదరాబాదు నుండి భయపడిపోయి విజయవాడకు రావడం జరిగింది. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య ఓ  కుర్రవాడి పై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టాయి. ఆర్టీసీ చైర్మన్ వర్ణ రామయ్య ఇటీవల ఓ బస్టాండ్ లో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది...ఈ క్రమంలో బస్సులో కూర్చున్నా ఓ దళిత విద్యార్థి వద్దకు వెళ్లి చుట్టుపక్కల ఇంత జరుగుతున్నా ఏమీ గమనించావా అంటూ గద్దిస్తూ మాట్లాడుతూ ...ఇయర్ ఫోన్స్ లో పాటలు వింటున్నా అతడిని కులం పేరు అడగడం జరిగింది.

ఈ క్రమంలో సదరు విద్యార్థి ఎస్సీ అని చెప్పగా ఎస్సీ అంటే మాల లేక మాదిగ అని అడిగాడు..వర్ల రామయ్య. దీంతో ఆ విద్యార్థి మాదిగా అని చెపితే.. నువ్వేమి చదువుతావు పక్కనే పట్టించుకోవటంలేదు వెదవా కనీసం పరిక్షలు కూడా రాసి ఉండవు. ఇంత చిన్న వయస్సులో సెల్ ఫోన్ ఎందుకు రా..? మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పొలం ఉందా? బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది? డబ్బుల్లేకపోతే ఎలా చదువుకుంటావ్.. ఫోన్లవి పక్కనపెట్టి చదువుకో’ అంటూ విద్యార్ధికి హితవు పలికాడు. దీంతో వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి రావెల కిషోర్ బాబు ఫైర్ అయ్యారు.

మాదిగ విద్యార్థి పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను ఖండించారు...ఆయన చేసిన కామెంట్స్ వల్ల మాదిగ జాతి మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వర్ల రామయ్య బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మాదిగ జాతి ఉద్యమం చేస్తుందని పేర్కొన్నారు.

అంతేకాకుండా తన నియోజకవర్గంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరులు జోక్యం చేసుకుంటున్నారని..అసలున్నావా నియోజకవర్గంలో వాళ్ళకు పని ఏమిటని ప్రశ్నించారు. దళిత ప్రజా ప్రతినిధుల నియోజకవర్గంలో ఇతరుల ప్రమేయం మంచిది కాదని హితవు పలికారు. అయితే రావెల కిషోర్ ఇన్ని కామెంట్ చేసిన చంద్రబాబు స్పందించకపోవడంతో రావెల పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: