ఏపీ: టీడీపీతో పోటీగా ఓటుకు రేటు పెంచేసిన వైసీపీ.. ఎంత ఇస్తున్నారంటే..??

Suma Kallamadi
ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ప్రజలకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి, తమ పార్టీకే ఓటు వేయాలని అడగడం కామన్ అయిపోయింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో ఇక్కడ కూడా డబ్బులను పంచడం ప్రారంభమైంది. అయితే టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీగా డబ్బులు పంచి పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, వైసీపీ 175 నియోజకవర్గాలకు ఆల్రెడీ డబ్బులు పంపించిందట. ఒక్కో ఓటర్‌కు రూ.2,000 చొప్పున డబ్బులు ఇచ్చేలాగా నిధులను సెండ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కలిపి రూ.2000 ఇచ్చేలాగా డబ్బులు పంపించినట్లు సమాచారం. అంటే ఒక్కొక్క అభ్యర్థి వెయ్యి రూపాయలు ఒక్కో ఓటర్ కు అందజేస్తారు. అయితే టీడీపీ వాళ్లు రూ.2,000 ఇస్తారని తెలిసాక వైసీపీ ఓటుకు రేటును పెంచినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల రూ.3,000 ఇవ్వాలని వైసీపీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎంత ఇస్తే దానికి కొంచెం ఎక్కువ మనీ ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారట. ఏది ఏమైనా ఓటుకు రేటు పెంచారనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీ పార్టీ డబ్బులు ఇవ్వకపోయినా ఈసారి ఎలక్షన్లలో గెలిచే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. కానీ జగన్ ఇతర పార్టీలకు పోటీగా మనీ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఓటర్లు ఈ రెండు పార్టీల నుంచి ఓటుకు నోటు పొందే అవకాశం ఉంది కాంగ్రెసు, బీసీవై లాంటి ఇతర పార్టీలు కూడా అక్కడక్కడ డబ్బులు పంచవచ్చు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎక్కువ మనీ డిస్ట్రిబ్యూట్ చేసి గెలిచే అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
ఇకపోతే మరొక వారం రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి రిజల్ట్ మరికొద్ది వారాల్లో వెలువడనుంది. ఈసారి ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతటా తిరుగుతూ జగన్ పై నిప్పులు జరుగుతున్నారు. జగన్‌ను ఎలాగైనా ఓడించి తాను మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. జగన్ మాత్రం తన మంచి పరిపాలనని మరింత కాలం పెంచుకోవాలని కృషి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: