దారుణం : కొడుకు అలా చేశాడని.. తల్లిని కట్టేసి కొట్టారు?

praveen
కొన్ని కొన్ని సార్లు సినిమాల్లో వెలుగు లోకి వచ్చిన ఘటనలు నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా సినిమాలో హీరో హీరోయిన్ ప్రేమించి ఇక ఇంట్లో చెప్పకుండా.. పారిపోయిన సమయం లో ఇక హీరోయిన్ కుటుంబ సభ్యులు హీరో తల్లి దండ్రులను బంధించి హింసించడం లాంటివి చేస్తూ ఉంటారు. పారి పోయిన వాళ్లని తిరిగి రప్పించే వరకు మిమ్మల్ని వదిలి పెట్టే ప్రసక్తి లేదు అంటూ వార్నింగులు కూడా ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే రియల్ లైఫ్ లో మాత్రం ఇలాంటివి జరగవు.  ఒక అబ్బాయి, అమ్మాయి ఇంట్లో చెప్పకుండా ఎక్కడికైనా పారి పోయిన సమయంలో.. ఇరు కుటుంబ సభ్యులు కలిసి వారి కోసం వెతకడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇరు కుటుంబాలు తమ అబ్బాయి, అమ్మాయి కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడం చేస్తూ ఉంటారు. కానీ అబ్బాయి తల్లిదండ్రులపై  అమ్మాయి కుటుంబీకులు... లేదంటే అమ్మాయి తల్లిదండ్రులపై అబ్బాయి  కుటుంబీకులు దాడి చేయడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం సినిమా తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

 ఏకంగా ఒక యువకుడు ప్రియురాలిని తీసుకుని పారిపోగా ఇక అతని తల్లిని కరెంటు స్తంభానికి కట్టేశారు అమ్మాయి కుటుంబ సభ్యులు. కర్ణాటకలోని హవేరే జిల్లాలో ఈ అమానవీయ ఘటన వెలుగు చూసింది. మంజునాథ్ అనే యువకుడు ప్రియురాలు పూజాతో పారిపోయాడు. దీంతో అతని తల్లిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఎలక్ట్రిక్ పోల్ కు కట్టేసి దారుణంగా కొట్టారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి బాధితురాలు హనుమవ్వను విడిపించారు. ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి. ఈ ఘటన స్థానికంగా సంచలనగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: