షాకింగ్ : ఆ దేశ వరల్డ్ కప్ జట్టులో.. 5గురు భారత సంతతి ఆటగాళ్లే?
ఈ క్రమంలోనే ఏప్రిల్ చివరి వరకు కూడా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది సభ్యుల వివరాలను ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టు విషయంలోనే.. ఆయా దేశంలో చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇస్తున్న యుఎస్ఏ కూడా ఇటీవల టీ20 వరల్డ్ కప్ జట్టు వివరాలను ప్రకటించింది. ఇలా యూఎస్ఏ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టు వివరాలు చూసుకుంటే.. అందులో పూర్తిగా భారతీయులే నిండి ఉన్నారు అని తెలుస్తుంది. అంతేకాదు ఇక జట్టు కెప్టెన్ గా కూడా భారత సంతతికి చెందిన మోనాక్ పటేల్ ఉండడం గమనార్హం.
ఇలా యూఎస్ఏ క్రికెట్ బోర్డు టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో భారత సంతతికి చెందిన మోనాంక్ పటేల్ కెప్టెన్ గా ఉండగా.. సౌరబ్ నేత్ర వల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్ పటేల్ చోటు సంపాదించుకున్నారు. ఇక మిగతా ప్లేయర్లలో న్యూజిలాండ్ మాజీ స్టార్ ప్లేయర్ కోరే అండర్సన్ కూడా ఉండడం గమనార్హం. అయితే ఇలా యూఎస్ఏ జట్టులో ఐదుగురు కూడా భారత సంతతికి చెందిన ఆటగాళ్లే ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ మారిపోయింది. కేవలం యుఎస్ఏ జట్టులో మాత్రమే కాదు మిగతా దేశాల జట్టులో కూడా ఈ మధ్యకాలంలో భారత సంతతి ఆటగాళ్లు చోటు సంపాదించుకుంటూ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.