వాంఖడే స్టేడియంలో.. బుమ్రా అరుదైన రికార్డ్?

praveen
టీమిండియా జట్టులో స్టార్ బౌలర్ గా కొనసాగుతున్న బుమ్రాకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  ఇక ఐపీఎల్ లోకి ఒక సాదాసీదా బౌలర్ గానే ఎంట్రీ ఇచ్చిన బుమ్రా తన ఆట తీరుతో అందరిని ఆకట్టుకున్నాడు.  అతి తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలోకి వచ్చాడు. ఇక భారత జట్టులోకి వచ్చిన తర్వాత కూడా తన బౌలింగ్ ప్రదర్శనతో జట్టులో స్టార్ ప్లేయర్గా మారి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు  అంతేకాదు టీమ్ ఇండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.

 అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు బుమ్రా. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు  అయితే ముంబై జట్టు వరుసగా విఫలం అవుతున్నప్పటికీ బుమ్రా మాత్రం తన ప్రదర్శనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక జట్టు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తాను ఏం చేయగలడు అనే విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నారు. ఎప్పటిలాగానే ఎన్నో అరుదైన రికార్డులను కూడా బద్దలు కొడుతున్నారు అని చెప్పాలీ.

 ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఓకే వేదికలో 50 వికెట్లు తీసిన ఐదో బౌలర్గా నిలిచాడు. అతను ముంబై హోం గ్రౌండ్ గా పిలుచుకునే వాంకడే  స్టేడియంలో మొత్తం 51 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ లిస్టులో సునీల్ నారాయణ 61 తో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత మలింగా (ముంబై ), అమిత్ మిశ్రా (ఢిల్లీ), చాహల్ (బెంగుళూరు) మైదానాలలో ఇక ఎక్కువ వికెట్లు పడగొట్టి ఓకే వేదికలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్లుగా రికార్డులు సృష్టించారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న బుమ్రా అటు టి20 వరల్డ్ కప్ జట్టులో కూడా ఎంపిక అయ్యాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: