కేసీఆర్, కేటీఆర్ పని అయిపోయినట్టేనా.. హరీషే అసలు లీడరా.?

Pandrala Sravanthi
తెలంగాణ రాష్ట్రం పేరు చెబితే దేశమంతా తొందరగా గుర్తుపట్టేది కేసీఆర్, హరీష్ రావు పేరు మాత్రమే. తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది వీరిద్దరు మాత్రమే. ఇక కేసీఆర్ వెనుక భాగంలో ఉంటే కీలక ఘట్టాలలో హరీష్ రావు ముందుండి నడిపించేవారు. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో వీరు పాలుపంచుకున్నారు. ఆ సమయంలో హరీష్ రావు ఎంతో హైలైట్ అయిపోయారు. రాష్ట్రం ఏర్పడి 2014 నుంచి 2023 వరకు  కేసీఆర్ ఏకధాటిగా పాలించారు. కానీ 2014లో ముందుగా హరీష్ రావును మంత్రివర్గంలోకీ తీసుకొని ఆ తర్వాత నిదానంగా కేసీఆర్ ఆయనను పక్కకు తప్పించడం ప్రారంభించారు. 


చివరికి కేవలం తన సిద్దిపేట నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేసేసారు. ఎందుకంటే కేటీఆర్ హైలెట్ కావాలంటే హరీష్ రావు పక్కకు తప్పుకోవాలి. ఇక అప్పటినుంచి హరీష్ రావు పక్కకు ఉండడం ప్రతి చోటా కేటీఆర్ కనిపించడం మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కేటీఆర్ ముందుండి నడిపించారు.  ఇక అప్పట్లో కేటీఆరే తనకు వారసుడు, మేనల్లుడైన హరీష్ రావుని అందుకనే పక్కన పెడుతున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి. తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చే సమయంలో హరీష్ రావు లేని లోటు కేసీఆర్ కు అర్థం అయింది. మళ్లీ ఆయన్ని దగ్గరికి తీసుకోవడం ప్రారంభించారు. కట్ చేస్తే చివరికి కేటీఆర్, కేసీఆర్ కలిసి ప్రతి ఎన్నికల్లో  ప్రచారం చేశారు. చివరికి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.


ఒక్కసారిగా బీఆర్ఎస్ పని అయిపోయిందని అపోహలు కూడా జనాల్లోకి వెళ్లిపోయాయి. చివరికి కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో బయటకు వచ్చిన తర్వాత జనాల్లో మళ్ళీ ఊపు వచ్చింది. కానీ కేటీఆర్ ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదే సమయంలో ప్రభుత్వం తప్పులను హరీష్ రావు నిందించడం మీడియాలో హైలెట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా హరీష్ రావు అధికారంలో ఉన్నా లేకున్నా మాస్ లీడర్ గా మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నారు. కానీ కేటీఆర్ మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదు. దీన్ని బట్టి చూస్తే మాత్రం కేసిఆర్ తర్వాత హరీష్ రావే ఆ పార్టీకి ప్రధానమైనటువంటి వారసుడిగా చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: