అభ్యర్థులకు కాదు.. నోటాకే గుద్దేస్తున్న ఓటర్లు?

praveen
ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ తమ భావాలను వ్యక్తపరిచేందుకు తమ అభిప్రాయాలను తెలియపరిచేందుకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ తమను పాలించే నాయకులను ఓటు వేసి ఎంచుకుంటూ ఉంటారు. ఇక ఎవరికి ఓటు వేయాలో ఎవరికి వేయొద్దు అన్న విషయాన్ని వారి నిర్ణయించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడే ఇక ఆ ప్రజలకు పాలకుడిగా కొనసాగుతూ ఉంటాడు అని చెప్పాలి.

 ఒకవేళ ఇలా తాము ఎన్నుకున్న పాలకుడి పాలన నచ్చకపోతే అదే ప్రజలు తర్వాత ఎన్నికల్లో మరొకరికి ఓట్లు వేసి అంతకు ముందు గెలిపించుకున్న వాడిని ఓడించడం లాంటిది కూడా చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ ఇక బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరు కూడా తమకు నచ్చకపోతే ఓటర్లు ఇక తమ అసంతృప్తిని వ్యక్తపరిచేందుకు ఏకంగా నోటా అనే గుర్తు కూడా అందుబాటులో ఉంటుంది   ఇలా అభ్యర్థులు ఎవరు కూడా నచ్చకపోతే ఇక నోటాకు ఓటు వేస్తూ ఉంటారు కొంతమంది ఓటర్లు. అయితే ఇలా నోటాకు ఓటు వేసి తమ ఓటును వృధా చేయకుండా.. చాలావరకు  ఎవరో ఒకరికి ఓటు వేయడం చేస్తూ ఉంటారు ఓటర్లు.

 కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఏకంగా ఓటర్లు అభ్యర్థులకు ఓటు వేయడం కంటే నోటాకు ఓటు వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలుస్తుంది. యూపీ, బీహార్ ప్రజలు నోటాని తెగ నొక్కేస్తూ ఉన్నారు. 2019లో యూపీలోని చాలా ఎంపి స్థానాలు మెజారిటీ ఓట్ల కంటే ఎక్కువ నోటా కే ఓట్లు పోలయ్యాయి. ఇక దేశంలోనే అత్యధికంగా బీహార్, గోపాల్ గంజ్ లో 51 వేల 660 ఓట్లు నోటా కి వచ్చాయి. ఇక తర్వాత పశ్చిమ చంపారన్ లో 45 వేల 699 ఓట్లు, నవడలో 34,514 ఓట్లు జహానాబాద్ లో 27,683 ఓట్లు నోటా కి పోల్ అయ్యాయి అని చెప్పాలి.  దీనిబట్టి ప్రజలు అభ్యర్థులకు ఓటు వేయడం కంటే నోటా కి ఓటు గుద్దడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: