ఈ "ఆంధ్రప్రదేశ్" కు ఏమైంది...!?

Chakravarthi Kalyan
రాజకీయాలతో వేడెక్కిన ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి కూడా కన్నెర్ర చేస్తోంది. గత వారం రోజుల్లో ఏపీలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. మొన్న ఏకంగా పిడుగుపాటుకు 17మంది వరకూ ప్రాణాలు వదిలారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే 40 వేల వరకూ పిడుగులు ఆంధ్రప్రదేశ్ పై విరుచుకుపడ్డాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురవ్వలేదు.


అంతటితో ఆగిందా అంటే అదీ లేదు.. ఇంకా 2, 3 రోజులపాటు గాలివానలు, పిడుగుల బీభత్సం కొనసాగుతుందని వాతావరణశాఖ వార్నింగ్ ఇస్తోంది. ప్రత్యేకించి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో ఆకాశం పూర్తి మేఘావృతమై ఉంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో  కోన్ని చోట్ల ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షం పడుతోందని వాతావరణ శాఖ తెలిపింది. 



పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలో ను చాలా చోట్ల వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. తీర ప్రాంతాల్లో 47 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయట. రాష్ట్రవ్యాప్తంగా పది నిమిషాల పాటు అకాల వర్షం సృష్టించిన బీభత్సం వల్ల రూ.16.63 కోట్ల పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి అంచనా వేశారు. ఆయన నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ, మెల్లంపూడి గ్రామాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు.



ఒక్కసారిగా ఎందుకు ఏపీపై ప్రకృతి పగబట్టింది. ఇంకా ఈ పిడుగుల వర్షం ఎన్నాళ్లన్నదానిపై స్పష్టత కనిపించడం లేదు. గతంలో కన్నా ప్రకృతి విపత్తులను ముందుగా తెలుసుకునే టెక్నాలజీ ఇప్పుడు పెరిగింది. దీని ఆధారంగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: