అమ్మో.. ఒకటో తారీఖు.. భయపడుతున్న బాబు...!?

Chakravarthi Kalyan
ఒకటో తారీఖంటే అందరికీ ఇష్టమే.. ఎందుకంటే చాలామందికి అది జీతాల రోజు.. కానీ ఈ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు ఒకటో తారీఖంటే భయపడిపోతున్నారట.. ఏ ఒకటో తేదీ.. ఏంటా కథ అనుకుంటున్నారా.. కేంద్రం కొంపదీసి కేసుల పేరుతో భయపెడుతుందనుకుంటున్నారా.. అదేం లేదు లెండి.. ఏపీలో నగదు కొరత సమస్య గురించి చంద్రబాబు అలా అన్నారు.


రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ప్రసంగించిన సీఎం.. రాష్ట్రంలో నగదు కొరత చాలా తీవ్రంగా ఉందన్నారు. అసలు నగదు కొరతకు కారణం ఏమిటంటూ బ్యాంకర్లను నిలదీశారు చంద్రబాబు. ఏటికేడు నగదు కొరత సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఈ సమస్యను ఎలా నిరోధించాలి ? అంటూ బ్యాంకర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు చంద్రబాబు. 


ఇదే పరిస్థితి కొనసాగితే... వ్యవసాయానికి చాలా ఇబ్బంది అవుతుందని.. నగదు కొరత సమస్యను సాధ్యమైనంత త్వరగా అధిగమించాలని బ్యాంకర్లకు చంద్రబాబు సూచించారు. అసలు ఒకటో తారీఖు వస్తోందంటేనే మేము భయపడాల్సిన పరిస్థితి వస్తోందని... ఒక్క ఫించన్లు కోసమే రూ.450కోట్లు కావాలని చంద్రబాబు బ్యాంకర్లకు వివరించారు. 


బాంకులు ఇలా వ్యవహరిస్తే సంక్షేమ కార్యక్రమాలు అమలు ఎలా చేయగలమని చంద్రబాబు ప్రశ్నించారు. డిపాజిట్లుగా వ‌స్తున్న డ‌బ్బులు  నాలుగోవంతుకు త‌గ్గిపోయాయని బ్యాంకర్లు చంద్రబాబుకు వివరించారు. తీసుకున్న డ‌బ్బుల్లో చాలా వ‌ర‌కూ జనం ఖ‌ర్చు చేయడం లేదని వాటిని తమ వద్దే ఉంచుకుంటున్నారని వివరించారు. జనం సొమ్ము వాడుకుంటామనే సంకేతాలు ఇవ్వడం వల్లే జనం ఇలా చేస్తున్నారని చంద్రబాబు వారితో అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: