ఏపీ: చంద్రబాబు ఓడిపోతే ప్రజలు ఎలా మాట్లాడుకుంటారో తెలుసా...??

Suma Kallamadi

సాధారణంగా ఎన్నికల్లో గెలుపు ఓటములనేవి ఓటర్లు చేతిలోనే ఉంటాయి. ఓటర్లు తలుచుకుంటే ఎంత పాపులర్ నాయకుడిని అయినా ఓడించగలరు. ఏపీలో ప్రస్తుతం ఓటర్లు ఎవరిని సీఎం చేస్తారని ఇది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 6 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆల్రెడీ ఓటర్లు ఎవరికి ఓటు వేయాలనేది నిర్ణయించుకున్నారు అయితే వీరిని తమ వైపు మార్చేందుకు ఆయా పార్టీలో శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.
అయితే టీడీపీ ఓడిపోతే ప్రజలు "నిజం గెలిచింది. చంద్రబాబు మోసాలను ఎవరూ నమ్మలేదు, జగన్ ను, జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలను నమ్మారు," అని మాట్లాడుకోవచ్చు. అలాగే కూటమి అనే అతుకుల బొంత పూర్తిగా విఫలమైంది అని ఎగతాళి చేయవచ్చు. భారతీయ జనతా పార్టీ వాళ్ళే టీడీపీ ఓడిపోయిందని తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకునే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా పట్టించుకోకపోవడం వల్లే టీడీపీ పరాజయం పాలైందని కామెంట్లు చేయవచ్చు. కూటమికి 31 సీట్లు కేటాయించడం వల్లే ఓడిపోయాం అని కూడా అనవచ్చు.
8 పార్లమెంటు సైట్లను ఇవ్వడం కూడా పెద్ద మైనస్ అని అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ సింగిల్ గా పోటీ చేసి ఉంటే ఈజీగా గెలిచి ఉండేది అని కూడా టీడీపీ నేతలు అంతర్గతంగా మాట్లాడుకోవచ్చు. అలాగే చంద్రబాబు చివరిలో మేనిఫెస్టోలో చాలా సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రకటించడం కూడా మైనస్ అని అనుకోవచ్చు. మామూలుగా చంద్రబాబు జగన్ ఉచిత పథకాలు ఎక్కువగా ఇస్తున్నారని విమర్శిస్తూ వస్తున్నారు. చివరికి ఆయన కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడం హ్యూజ్ బ్లెండర్ అయిందని అనుకోవచ్చు.
సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక లాగా తయారవుతుందని మొత్తుకున్న చంద్రబాబు ఏ చివరికి వాటిని ఇస్తానని చెప్పడం ఆయన ఓటమిని శాసించిందని టిడిపి తమ్ముళ్లు మాట్లాడుకోవచ్చు. మరి టిడిపి ఓడిపోతుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొంత సమయం వేచి చూడాల్సిందే చాలా సర్వేలు మాత్రం టీడీపీకి వ్యతిరేకంగానే అంచనాలను రిలీజ్ చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: