"పార్లమెంట్ లోనూ కాస్టింగ్ కౌచ్ ఉంది" షాకింగ్ రెణుక చౌదరి వ్యాఖ్య

కాస్టింగ్ కౌచ్ అనేది ఒక భయంకరమైన నిజమని భారత మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరిగారు వ్యాఖ్యానించారు. క్యాస్టింగ్ కౌచ్ ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమని కట్టి కుదిపేస్తున్న అంశం మాత్రమే కాదని ఈ ప్రపంచమంతా అది విస్తరించి ఉందని చెప్పారు. అవకాశాల పేరుతో అమ్మాయిలను తెలుగు చిత్రసీమలో వాడుకుంటున్నారనే ఆరోపణలు కలకలం రేపుతుండగా, క్యాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా నటి శ్రీరెడ్డి చేస్తున్న వీధి ఎలక్ట్రానిక్ మీడియాను సైతం వాడుకుని చేసే పోరాటం సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. 

ఈ సందర్భంగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ, క్యాస్టింగ్ కౌచ్ అనే ఈ దురాచారం ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు భారత ప్రజల అభిప్రాయాలు, ఆశలు, ఆశయాలకు ప్రతిరూపమైన చట్టాలను చేసే భారత పార్లమెంటులోనూ ఉందనే మాట సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఈ మాట అన్నది ఎవరో సాధారణ పౌరుడో, సినిమా పరిశ్రమకు చెందిన ఏ నటో కాదు, నూట ముప్పైయేళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఫైర్ బ్రండ్ గా గుర్తించిన, సీనియర్ నేత, ఎంపీ రేణుకా చౌదరి. 

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ రేణుక ఈ వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ సినిమా రంగానికే కాదు, అనేక కార్యాలయాల్లోనూ, స్త్రీ  పురుషులు కలసి పనిచెసే, లెదా కలసి ఉండే ప్రతి చోటా,  ఇది కనిపిస్తుంటుందని ఆ మాజీ పార్లమెంట్ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. పార్లమెంటు కూడా దీనికి అతీతమైనదేమీ కాదని ఆమె బాంబు పేల్చారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే లేదని, అన్ని చోట్లా ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ దీనికి అతీతమైన స్థలం కాదని మరే ఇతర ప్రాంతం కూడా దీనికి అతీతం కాదని ఆమె స్పష్టం చేశారు. ఇష్టం ఐనా కాకపోయినా ఇది  నూరు శాతం నిజమని చేదు నిజమని ఆమె నిర్ద్వంధంగా ప్రకటించారు. ఈ వ్యవహరంపై దేశమంతా "మీ... టూ...." అంటూ ఒక్కతాటి పైకి వచ్చి ధీటుగా పోరాడాలని ఆమె పిలుపు నిచ్చారు.

కాగా, సినీపరిశ్రమలో కొరియోగ్రాఫర్గా సుధీర్ఘ కాలం కొనసాగుతున్న లీడింగ్ లెడీ, సరోజ్ ఖాన్ టాలీవుడ్ నటి శ్రీరెడ్ది సంఘటనను ఉటంకిస్తూ, అందర్ని ఆశ్చర్య పరుస్తూ  "ఎవరినీ రేప్ చేసి వదిలేయడం లేదని, వాడుకుని వదిలేయడం లేదని, క్యాస్టింగ్ కౌచ్ వల్ల కొందరికి జీవనోపాధి లభిస్తోందని"  వ్యాఖ్యానించటం, దేశ వ్యాప్త సంచల నాన్ని రేపాయి. లైంగిక ఆనందం ఇవ్వటానికి సినిమా అవకాశాలు కలిపించటానికి బార్టర్ సిస్టంలో లాగా ఒక దానికి బదులు మరొకటివ్వటం అనే ప్రాధమిక సూత్రానికి సరిపోతుందన్న ఆమె మాట బాలీవుడ్ లోనే కాదు దేశమంతా సంచలనం అవగా, ఆ తర్వాత సరోజ్ ఖాన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. శ్రీరెడ్డి కూడా సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను ఖండించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: