పవన్ కళ్యాణ్ ప్రశ్నలో అంత అంతరార్థం ఉందా..!

సినిమాల్లో నటించి ప్రఖ్యాతి గాంచిన ప్రతి నటుని గమ్యం 'రాజకీయ కేంద్రం' లో కీలకంగా మారటం. తమిళనాట పుట్టిన ఈ తరహా సాంప్రదాయం తెలుగునాడుకు ప్రాకింది. సినిమా(యా) నటీనటులపై దక్షిణాది ప్రజలకున్న అభిమానం స్థాయి అనేక సంధర్భాల్లో పరిదిదాటి దురభిమాన స్థాయికి చేరి తొండముదిరి ఊసరవెల్లి ఐనట్లు, "సినిమా(యా) కథానాయకుడు ముదిరితే రాజకీయనాయకుడు ఔతారు" అనే నానుడి పుట్టింది. 'మెగా పవర్ స్టార్'  పవన్ కళ్యాణ్ కి. ఈ బిరుదులో కొంతభాగం వారి మూల విరాట్ మెగాస్టార్ చిరంజీవి నుంచి రాగా, పవర్ స్టార్ అనేది వీరు తగిలించుకుంది. ప్రజలు వీరినటనను మెచ్చి సన్మానించి ఇచ్చిన బిరుదు ఇది గాదని మనవి.

తన అన్న చిరంజీవి తన నాలుగు దశాబ్ధాల వృత్తి జీవితంలో ఒక దశాబ్ధం రాజకీయాలకు వదలివేస్తే, మూడు దశాబ్ధాల్లో 150 సినిమాలు చేస్తే ఆయన చీమలా కష్టించి కూకటి వ్రేళ్ళ నుండి నిర్మించిన అభిమాన సామ్రాజ్యంపై ఒక్క సారిగా వచ్చిచేరిన అనకొండ పవన్ కళ్యాణ్. అంటే చిరంజీవి నిర్మించిన చీమల పుట్టలో చేరిన కాలసర్పమే పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు. అంతకు మించిన ప్రత్యేకతలు పవన్ కళ్యాణ్ లో ఇప్పటివరకేమీ లేనేలేవు. "చెగువేరా" తన అభిమాన యోధుడని ఆయన గురించి చెప్పటం తప్ప.  పట్టుమని 25సినిమాల్లో నటించటానికి 25యేళ్ళు పట్టింది. ఇది చాలు ఒక వ్యక్తిలో సోమరితనం ఎంతగా పాకిపోయిందో చెప్పటానికి.

ఇందులో కూడా విజయం శాతం అంత గొప్పగాలేదు. ఒక్కో వైఫల్యం విలువ ఒక్కో పంపిణీదారుని సంపూర్ణ పతనం అనిచెప్పొచ్చు. ఉదాహరణకు ఈ మద్యవిడుదలైన కథానాయకుని సినిమాలు సర్ధార్ గబ్బర్ సింగ్, అఙ్జాతవాసి నిర్మాతలు బ్రతికి బట్ట కట్టినా పంపిణీదారులు మాత్రం నింగి నుండి నేలపై పడ్డారు. ఆ పతనం అంతా ఇంతా కాదు. వీరి సినిమాలపై ప్రేక్షకుల అభిమానం నేలను అంటటంతో మరో మార్గం అవసరం అనిపించింది. అలా దశ మార్చుకున్న నట జీవితం రాజకీయం దారి పట్టి ప్రజల పాలిట శనిలా చుట్టుకుంది.


2014 లో ఆయన రాజకీయం బాజపా-టిడిపి విజయానికి మద్దతు ఇస్తూ వారి పరిపాలన సజావుగా నడవక ప్రజా శ్రేయస్సుకు వారిచ్చిన వాగ్ధానాలు నేరవేరక పోతే ప్రశ్నిస్తాన న్న ఆయన మాటను నమ్మి అభిమాన ప్రేక్షకుల 'ఓట్ల గుద్దుడు' తో ఈ మిత్రద్వయం ఏకమై సంకీర్ణ విజయం సాధించారు.  వారే కేంద్రంలోని బాజపా రాష్ట్రం లోని తెదెపా. కేంద్రం రాష్ట్రానికి విభజన ప్రయోజనాలతో పాటు ఆ దివినున్న అమరావతిని నేలపైదింపి దేవేంద్రుణ్ణి ఆశ్చర్యపరుస్తానన్న తెదెపా మాటకు మద్దతిచ్చింది. పూర్వాపరా ల్ని అలోచించని భోళాశంకరుడులాగా.


కాని ఇక్కడ తెదెపా నాయకుని ప్రణాళిక హైదరాబాద్, బాంగళూర్, చెన్నై మహానగరాల్ని తలదన్నే కాస్మోనగరాన్ని రియల్ ఎస్టేట్ విపణి, వ్యాపార, కీలక కేంద్రాన్ని నిర్మించటం తద్వారా తానొక మహీపతి కావాలనుకోవటం. అదీ ఒక ప్రణాళికా కాలం లోపుగానే. అలా జరగాలంటే భారత దేశపు ఒక ప్రణాళికా కాలం బడ్జెట్ కావాలి. అందుకే రోజుకొక గుడ్డు పెట్టే కోడి కడుపులో ఉన్న గుడ్లన్నీ ఒకేసారి కొట్టెయ్యాలన్న నెపం తో కోడిని కోసిన దురాశా పరుని కథలో వాడికి కనీసం ఒక గుడ్డైనా మిగిలింది. అలాంటి నానుడికి ప్రత్యామ్నాయమే క్రమక్రమాభి వృద్ధి నిచ్చే "ప్రత్యేక ప్రతిపత్తి హోదా" కు బదులు ప్రత్యేక పాకేజికి రాష్ట్రాధికారాన్ని అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ అధినేత కు చంద్రబాబు నాయునికి చివరకు చేతిలో చిప్ప చేతిలో పెట్టాడు కేంద్రంలోని నరెంద్ర మోడీ. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ వచ్చి "అఙ్జాతవాసి ఏడురోజుల పాటు రోజుకు ఏడాటలు అనుమతి" కి తన ప్రశ్నించటాన్ని తాకట్టు పెట్టాడు.   

ఈ చిరంజీవి కష్టాన్ని ఆయన మంది మార్బలం దాదాపు చిత్రసీమకు చేరుకొని "మెగా మంద టాలీవుడ్ కు గుదిబండ" లా మారారు. ఈ వంశానికి తప్ప ఎవరికీ సినిమాల అవకాశాలు కనిపించవు. ఏవరికో ఒకరిద్దరికి తప్ప. బహుశ పవన్ తరవాత వీళ్ళు రాజకీయం వైపుకు దిశ మార్చుకొని నిజమైన రాజకీయ నాయకులుగా సేవ చేద్దా మని అనుకునే వారికి దశ లేకుండా చేసే అవకాశాలు పుష్కళంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చిన్న నిర్మాతల సినిమాల విడుదలకు చోటివ్వని ధియేటర్స్ పై వీరి కుటుంబ గుత్తాధిపత్యానికి టాలీవుడ్ నిక్కి నీల్గుతుందని చిన్న నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. "మర్రి మహా వృక్షం నీడలో మరో మొక్క కూడా మొలవదనే సామెత" ను నిజం చేస్తున్నారు. 

తెలంగాణా రాజకీయ క్షెత్రం లో కెసిఆర్ కుటుంబం, ఆంధ్రప్రదెశ్ రాజకీయ రంగంలో నందమూరి-చంద్రబాబు కుటుంబం గుత్తపెత్తనం పెరిగిపోగా ఇప్పుడు సినీ భవిషయ్ట్ లో రాజకీయ రంగంలొకి ఉదయించే సూర్యులు చిరంజీవి మంద చేరనున్నారు. ఇక ప్రజాస్వామ్యానికి స్థానమెక్కడ? అంతా కుటుంబాల నియంతృత్వం మన రాష్ట్రానికి తప్పదేమో?  వీరి దురాశకు వద్దన్నా వచ్చి చేరే వీరి కులవర్గం కూడా 12 శాతమట. ఇక మామూలు ప్రజానీకం తమ ఆశలు నెరవేర్చుకునేదేలా?

మన పొరుగుదేశం చైనాలో ఏక వ్యక్తి పాలన - మన తెలుగు రాష్ట్రాలో ఏక కుటుంబ పాలన - ప్రజాస్వామ్యాలు కనుమరుగు అవు తాయేమో? గుడ్డిలో మెల్ల అన్న సామెతగా అదృష్టం ప్రధాని నరెంద్ర మోదీకి పిల్లలు లేరు ఇక అవకాశం కూడా లేదు కదా! 
  
(సశేషం)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: