అమరావతి అంతా గ్రాఫిక్సే - అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సీన్ ఏమీ ఉండదు: కేంద్ర మంత్రి పీయుష్

నరెంద్ర మోడీ ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించిన సుధీర్ఘ రాజకీయ అనుభవశీలి తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై బాజపా నుండి ఎదురు దాడి మొదలైంది. కేంద్ర మంత్రులు నిశ్శబ్ధంగా రంగంలోకి దిగారు. ఒక్కొక్కరుగా చంద్రబాబు తీరుపై విమర్శలుచేయటం ప్రారంభించారు. కేంద్రం తమను ఆదుకోవటం లేదని, నిధులు ఇవ్వటం లేదని, విభజన హామీల్ని నెరవేర్చటం లేదన్న విమర్శనాస్త్రాల్ని ఎక్కుపెట్టారు ఏపి అధినేత చంద్రబాబు. కేంద్రంపై అవిశ్వాసంపెట్టటం వెనుక వాస్తవం కంటే భావోద్వేగం, సెంటిమెంట్ ఎక్కువగా ఉందని విమర్శించారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.
 
తాజాగా ఒక న్యూస్ ఛానల్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలుచేశారు. ఈశాన్యరాష్ట్రాలకు మినహా మరే ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం వెల్లడించిందన్న ఆయన, బాబు సర్కారుకు నిధులపరంగా సాయంచేసినా అవేమీ అమలుకావటం లేదన్నారు. 

రాజధాని అమరావతికి తాము ఇప్పటివరకూ రూ.2500 కోట్లు ఇచ్చామని, కానీ అక్కడేమీ పనులుగాని అభివృద్దిగాని కనిపించలేదన్నారు. నిధులు అడిగే చంద్రబాబు వాటిని ఖర్చు పెట్టే విషయంలో, గణాంకాలు వివరించే విషయంలో మాత్రం వెనుకబడ్డారన్నారు. ఇప్పుడు అమరావతికి మనం వెళితే అక్కడేమీ కనిపించదన్న ఆయన, ఇంత కాలం మామూలుగా ఉండి హటాత్తుగా విమర్శలు చేస్తున్నారన్నారు. 

బాహుబలి మాహిష్మతిని తలపించే అమరావతి గ్రాఫిక్స్ 

తాము రాష్ట్రానికి అన్ని రకాల నిధులు అందించామన్నారు. నిధులు అడిగే చంద్రబాబు, విధులు నిర్వహించ్ఝటం లో వాటితో అభివృద్ధి పనులు చేయటంలో మాత్రం పూర్తి గా వైఫల్యం చెందారు. చంద్రబాబు తన నాటకాన్నే యుద్ధం అంటుంటారని, తాము చట్టబద్ధమైన హామీలు అన్నింటికి కట్టుబడి ఉన్నట్లు గా పీయూష్ స్పష్టం చేశారు. మొత్తం గా బాబు తీరును తప్పు పట్టటంతో పాటు, ఆయన మాటలన్నీ తప్పేనన్న విషయాన్ని నమ్మకం కలిగే రీతి లో వ్యాఖ్యలు చేయటం గమనార్హం. పీయుష్ మాటల ప్రకారం చంద్రబాబును నమ్మలేమనే విషయం స్పష్టమౌతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: