9 లక్షల భారతీయ ఐటి వృత్తి నిపుణులకు జపాన్ ఆహ్వానం-యుఎస్-"హెచ్ 1బి" కి చెక్


"బెంగళూరు ఛాంబర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ కామర్స్‌-బి సి ఐ సి" & "జపాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌'-"జెట్రో" సంయుక్తంగా నిర్వహించిన భారత్‌-జపాన్ వ్యాపార సెమినార్‌ లో, దేశానికి చెందిన రెండు లక్షల మంది ఐటీ నిపుణులను ఎంపికచేసుకోవాలని నిర్ణయించామని భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్తని జెట్రో ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షుడు షిగేకి మైడా వెల్లడించారు. 

దేశానికి చెందిన రెండు లక్షల మంది ఐటీ నిపుణులకు జపాన్‌ ఉద్యోగావకాశాలు కల్పించనుంది. అక్కడ సమాచార, సాంకేతి కత విస్తరణ, అవస్థాపనా సౌకర్యాల కల్పనలో వీరు పాలు పంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఐటీ నిపుణుల సేవలను వినియోగించుకోవాలని జపాన్‌ నిర్ణయించింది.

మేడా కోరేది "అత్యద్భుత సమాచార సాంకేతిక (ఐటి) పరిఙ్జానం" సాధించటానికి భారత సాంకేతిక నిపుణుల సహకారం కావా లని కోరుకుంటున్నారు. ఈవిధంగా ఉద్భవించ బోయే అధునాతన సాంకేతికతకు వేగవంతంగా తనను తాను మార్పు చెంద గలిగే అత్యత్భుత సృజనాత్మకత కలిగిన సాంకేతిక నిపుణులు మాత్రమే సరిపోతారని చెప్పారు. ఈ మనసాక్షికి సంబందించిన ప్రక్రియకు కావలసిన అత్యద్భుత నైపుణ్యం కలిగి పోటీ లో నిలబడే లైఫ్-సైన్సెస్, వ్యవసాయం, ఆర్ధికం, సేవల రంగాలకు అవసరము ఉందట  వారు భారత్ లో సులభ్యమని చెప్పారు మేడా.

దీనికి భారతీయ నిపుణులకు ఇవ తారీఖు జనవరి 2018 నుండే విసాల విడుదల ఏర్పాట్లు చేసారని వివరించారు. అంతేకాదు ఒక్క సంవత్సరం లోపే వారికి శాశ్వత నివాస ఏర్పాట్లు ఇవ్వనున్నారు. ఇందు కోసం భారతీయులు జపాన్‌లో స్థిరపడేందుకు అక్కడి ప్రభుత్వం "గ్రీన్‌ కార్డులు" ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని షిగేకి మైడా తెలిపారు. 2030నాటికి భారత్‌ నుంచి ఎనిమిది లక్షల మంది ఐటీ నిపుణులను ఎంపిక చేసుకోవాలని జపాన్‌ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జపాన్‌లో 920000 మంది ఐటీ నిపుణులు ఉన్నారు. వీరు కాకుండా మరో రెండు లక్షల భారతీయ ఐటీ నిపుణుల అవసరం జపాన్‌ కు ఉంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ వీసాలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఈ విషయం భారత ఐటీ రంగానికి ఊరట నిచ్చినట్లయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: