జగన్ కి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయా..?!

siri Madhukar
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చారు.  ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఏపీలో జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం కొనసాగుతుంది.  కేంద్రం ఇచ్చిన మాట నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెబుతూ..ప్రజల విశ్వాసంపై దెబ్బతీస్తుందని అధికార పక్షం సైతం కేంద్రంపై తిరగబడే పరిస్థితికి వచ్చింది. ఇదిలా ఉంటే..మూడున్న సంవత్సరాలుగా ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ..ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ..వస్తున్న వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం అవసరమైతే రాజీనామాలు చేస్తామని ప్రకటన చేశారు. 

విభజన సమస్యల పోరాటం పేరుతో టీడీపీ ఫుల్లు జోష్ లో ఉంది. బీజేపీతో స్నేహం కోసం మొహం వాచి ఉన్న జగన్ ఇప్పుడు తన కోరిక నెరవేరబోతోందన్న ఆనందం కంటే.. ఆ స్నేహంతో వచ్చే బ్యాడ్ నేమ్ కలవర పెడుతోంది. బీజేపీతో కుమ్మక్కయితే జనం ఎక్కడ ఓటుతో బుద్ది చెబుతారో అన్న ఆందోళన కూడా కలవరపరుస్తోంది.  కొంత కాలంగా వైసీపీలో వర్గ పోరు ఎక్కువైంది..ఇప్పటికే పలువురు నేతలు టీడీపీలోకి జంప్ అయ్యారు. ప్రతి జిల్లాలోనూ నాయకుల మధ్య ఆధిపత్య పోరు కలవరపెడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారం మధ్య కోల్డ్‌వార్ పీక్ లెవల్ కు చేరిపోయింది.

ఈ జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్ని కనుసైగలతో శాసించారు. మంత్రిగా ఓ రేంజ్ లో చక్రం తిప్పారు. వైసీపీలో ఇప్పుడు జిల్లాకు ఆయనే పెద్ద దిక్కు. ఆయన తర్వాత తమ్మినేని సీతారం, రెడ్డి శాంతి వంటి నేతలకూ సొంత ఇమేజ్ ఉంది.  శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచీ టీడీపీ కంచుకోట. కేవలం 2004, 2009లో మాత్రమే ఇక్కడ టీడీపీకి ఎదురుగాలి వీచింది. మళ్లీ 2014లో టీడీపీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.

మంత్రి ధర్మాన మాత్రం జిల్లాలో మిగిలిన సీనియర్ నేతలకు ఛాన్స్ లేకుండా అన్ని నియోజకవర్గాలను తన గ్రిప్ లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆముదాల వలస, పాతపట్నం తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో తన అనుచరులనే ఇంఛార్జ్‌లుగా పెట్టుకున్నారు. బలమైన కళింగ, కాపు సామాజిక వర్గాలకు చెందిన సీతారాం, రెడ్డిశాంతి ఓ గ్రూపుగా తయారయ్యారు. ఈ గ్రూపు రాజకీయాలు చూసి మళ్లీ  2014 ఫలితాలు రిపీటవుతాయేమోనని వైసీపీ స్థానిక నేతల్లో గుబులు నెలకొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: