భావి భారత ప్రధాని చంద్రబాబే! - పాపం! నరెంద్ర మోడీ

చంద్రబాబు సుధీర్ఘదర్శి. అనుభవఙ్జుడు అపార విఙ్జానఖని. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిపై కలలుకంటున్న స్వాప్నికుడు. మన లోని ఔన్నత్యాన్ని మనకై మనం చెప్పుకోవడం కంటే, సార్ధులు మనకంటే ఉన్నతులు వివరిస్తేనే దానికి అర్దం పరమార్ధం ఉంటుంది. ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులు మన గొప్పతనాన్ని పదిముందు పొగిడితే ఆ ఆనందం ఎలా ఉంటుంది అనేదానికి మాటలుండవు.

అలాంటి అద్భుత పరిస్థితే ఎదురైంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. మొన్న ప్రపంచ ప్రఖ్యాత భారతీయ పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ విశ్వనగరం అమరావతిని సందర్శించిన సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడిగారి దూరదృష్టిని గురించి ప్రశంసించారు. 1999లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్ల ఆయన జామ్‌నగర్‌లోని మా రిఫైనరీని సందర్శించారని, అప్పుడు మా నాన్నగారు ధీరూబాయ్‌ అంబానీతో మాట్లాడు తూ "టెలికాం రంగం లోకి వస్తే బాగుంటుందని" సలహా ఇచ్చారు. ఆ రంగం భవిష్యత్ లో ఊహించనంతగా ఊహలకు మించి ఎదుగుతుందని చెప్పారని, ఆ సలహాతోనే మా నాన్నగారు టెలికాం పరిశ్రమ వైపు తొలి అడుగు వేశారన్నారు. ఆ రకంగా రిలయన్స్‌ కంపెనీ చంద్రబాబు గారికి ఎంతగానో రుణ పడి ఉందంటూ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.


అంతేకాదు "చంద్రబాబు నాయుడు లాంటి సమర్థుడైన నాయకుడు ఇంతకంటే "మరింత పెద్దహోదా" లో అధికారంలో వుంటే రాష్ట్రానికి దేశానికి కూడా అద్భుత ప్రయోజ నాలు ఫలితాలు ఒనగూరుతాయి" అన్నారు. ఇప్పుడు ఈ మాటల చుట్టే రసవత్తరంగా ప్రస్తుత రాజకీయాల్లో తెగ వాడి వేడిగా చర్చలు నడుస్తున్నాయి. ఆ మాటలు ఎవరో సాదా సీదా మనిషి  అంటే ఏదో అన్నాడులే అంటాం . అన్నది భారతీయ పారిశ్రామిక దిగ్గజం అంబాని అగ్రజుడు కాబట్టే అంతగా చర్చించుకోవాల్సిన అవసరమొచ్చింది. దేశ రాజకీయాలను శాసించగల వ్యక్తి ముకేష్ అంబానీ. అందుకే ఈ మాటలు అంతగా హాట్ టాపిక్ గా ట్రెండింగ్ అవుతున్నాయి.


ముకేష్ అంబానీ భావిస్తున్న "పెద్ద హోదా" అన్నరంటే అది "ప్రధానమంత్రి పదవి" మాత్రమేనని అమరావతిలోని ప్రముఖ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కొంత మంది వాదన మాత్రం వేరేలా ఉంది. ప్రస్తుతం ప్రధాని నరెంద్ర మోడీ, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడి మధ్య దూరమో? వైరమో? పెరిగిన నేపథ్యంలో, వీరిద్దరి మధ్య రాయబారిగా ఇరువురి సన్నిహితుడు ముకేష్ అంబానీ వచ్చారన్నది అసలు సమాచారం అంటున్నారు. 


ఏదో రాయబారానికి వచ్చిన ముకేష్ అంబానీ ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదని, "పెద్ద హోదా"  లాంటి  "గొప్ప పదాలు" వాడారంటే, ఆయన మాటల్లోని ఆంతర్యాన్ని డీకోడ్  చేసి మస్తిష్కంలోని మర్మం  తెలుసుకోవటానికి రాజకీయ విశ్లేషకులు తమ మస్తిష్కాలకు పదును పెట్టి మరీ రంధ్రాన్వేషణ చేస్తూ బుర్రలు బద్దలు కొట్టుకొని ఈ ఆలోచనకు వచ్చారని అంటున్నారు.


నరెంద్ర మోడీ హవా తగ్గిపోయిందని, ఆయన స్వయంకృతాపరాధాలే ఆయన పతనానికి మార్గనిర్దేశనం చేస్తున్నాయని గ్రహించిన ముకేష్ అంబానీ ముందుగా అత్యంత సుధీర్ఘ రాజకీయానుభవంతో సమర్ధత ఉన్న పరిపాలనా దక్షుడైన చంద్ర బాబు "పెద్దహోదా" లో ఉండాలని, దేశ భవిష్యత్తును, తమ పారిశ్రామిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని  అన్నట్టు భావిస్తున్నారు. 


చంద్రబాబు తాను కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన రోజుల్ల ప్రధానిమంత్రి అయ్యే అవకాశం చాలా సార్లు వచ్చింది. కానీ అప్పుడు ఆయన దాన్ని సున్నితంగా తిరస్క రిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈసారి అలాంటి అవకాశం వస్తే అలాంటి నిర్ణయం బాబు తీసుకునే అవకాశం లేదు. ఇప్పుడు దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో, ముందు చూపున్న సమర్ధవంతంగా ఆలోచించే చంద్రబాబులాంటి దేశం ప్రధానంగా ఫలితాలను సాధించగల సమర్ధవంత మైన నాయకుల అవసరం ఎంతైనా వుంది. ఈ విషయాన్ని గ్రహించే ముకేష్ అంబానీ తన ఆకాంక్షను అలా వ్యక్తం చేసి వుంటారనేది అమరావతి ఆలోచనాపరుల మస్తిష్కాల్లో మెదులుతున్న భావప్రకంపనలు. మరి మన భావి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణా? లోకెష్ బాబా? 

మరి వారనుకున్నదే జరిగితే పాపం! నరెంద్ర మోడీ పరిస్థితి ఏమౌతుందొ ? అనే దాన్ని కాలానికే వదిలేద్ధాం.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: