ఏపీ: పొత్తులో లొల్లి.. వీటికి సమాధానం ఏది..?

Divya
ఆంధ్రప్రదేశ్లో ఈసారి పొత్తులతో జనసేన టిడిపి బిజెపి పార్టీలు మూకుమ్మడిగా ఒక్కటై పోటీ చేయబోతున్నాయి.. అందులో భాగంగా సీట్ల పంపకాలు కూడా చేయడం జరిగింది.. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల పొత్తులు చాలా తలనొప్పిగా మారుతోందని పలువురు నేతలు తెలియజేస్తూ ఉన్నారు.పొత్తుల ఎత్తులకు సంబంధించి తాజాగా జరుగుతున్న పరిణామాల వెనుక సీనియర్ జర్నలిస్ట్ పలు విషయాలను వెల్లడిస్తున్నారు. వాటి గురించి చూద్దాం.

ప్రతిపక్షం పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ కేవలం రాజకీయాల కోసమే తప్ప ఉమ్మడి లక్ష్య కార్యాచరణ ఎక్కడ కనిపించడం లేదని తెలియజేస్తున్నారు. అందుకు సంబంధించి మూడు అంశాలను కూడా వివరించారు.
ముస్లిం రిజర్వేషన్ల పైన.. మత ప్రాతిపరమైన ఉన్నాయి. కనుక రద్దు చేస్తామని బిజెపి అధినాయకుడు అమిత్ షా కర్ణాటక, తెలంగాణ ఎన్నికలలో స్పష్టం చేశారు. బిజెపితో స్నేహం చేస్తున్న చంద్రబాబు ఓకేనా కాదా అనే విషయం పైన స్పష్టత లేదు.

సంక్షేమం విషయంలో జగన్ రెండాకులు తింటే.. చంద్రబాబు నాలుగాకులు తింటానంటున్నారు. ప్రధాన నరేంద్ర మోడీ ఉచితలను సంస్కృతిని వ్యతిరేకించారు.. సంక్షేమం విషయంలో చెరొక దారి అయితే ముందుకు ఎలా వెళుతుంది. పైగా సంక్షేమ అజెండాను సైతం మళ్లీ అధికారంలోకి రాబోయే బిజెపి సర్కార్ తో అమలు  చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. నమ్మడం ఎలా అంటూ పలువురు నేతలు ప్రజలు కూడా అడుగుతున్నారు.

విభజన హామీలను ప్రత్యేక హోదా తెగ తెంపులు చేసుకొని గతంలో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు.. ఇప్పుడు మళ్లీ పొత్తు అంటే హోదా విషయంలో మోడి వైఖరి మారిందా లేకపోతే బాబు.. మరొకసారి రాజీ పడ్డారా. ఈ విషయం పైన కూడా స్పష్టత లేదు.. ఇలాంటి విషయాల పైన అటు వైసీపీ ప్రభుత్వ మనిషి అనకుండా కేవలం తనకు సమాధానాలు చెప్పాలంటూ సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు అడుగుతున్నారు.. ఈ విషయం పైన చంద్రబాబు తరఫున ఉండేవారైనా స్పష్టత ఇస్తే ఎన్నికల సమయంలో చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: