అమ్మో..! ఆసుపత్రిలో ఆ ఎలుక ఎంత పనిచేసిందో తెలుసా..!!

Vasishta

కొన్ని సంఘటనలు చూడ్డానికి, వినడానికి చాలా చిన్నవిగానే ఉంటాయి. కానీ వాటి తీవ్రత అంచనా వేస్తో ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇప్పుడు మనం చదవబోయే సంఘటన కూడా అలాంటిదే.! ఆసుపత్రిలో ఓ డాక్టర్ నే ఎలుక కాటేస్తే ఆ ఆసుపత్రికి వచ్చే రోగుల మాటేంటి మరి...!?


          వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వాసుపత్రికి నిత్యం ఎంతోమంది రోగులు వస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఊళ్లకు ఈ ఆసుపత్రే పెద్ద దిక్కు. తెనాలి ఆసుపత్రి పేదల పాలిట వరం. అలాంటి ఆసుపత్రిలో ఎలుకల బెడద ఎక్కువైంది. గతంలో ఎన్నోసార్లు ఎలుకల సంచారాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వాటిని పట్టుకోవడానికి ఓ ఏజెన్సీని నియమించుకున్నారు. ప్రస్తుతం ఎలుకల నియంత్రణ బాధ్యతను ఆ ఏజెన్సీయే చూస్తోంది.


          అయితే.. ఆదివారం సెలవు. అయితే డ్యూటీ డాక్టర్ ఉంటారు. అలాగా ఆరోజు విధులకు హాజరైన ఓ డాక్టర్ SNCU వార్డులో.. అంటే.. అప్పుడే పుట్టిన పిల్లలకు వైద్యం అందించే ICU లాంటి వార్డులో ఆ డాక్టర్ డ్యూటీ చేస్తున్నాడు. ఇంతలో ఓ ఎలుక ఆ డాక్టర్ ను కరిచింది. దీంతో విస్తుపోయిన ఆ డాక్టర్ వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేశారు. ఆమె ప్రతిరోజూ ఆ ఏజెన్సీకి మార్కులు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆ ఏజెన్సీకి జీరో మార్కులిచ్చారు. దీన్ని ఆన్ లైన్ లో గమనించిన ఆ ఏజెన్సీ నిర్వాహకులు సూపరింటెండెంట్ ను సంప్రదించారు.


          ఏజెన్సీ నిర్వాహకులకు ఇలా జరిగిందని సూపరింటెండ్ చెప్పేంతవరకూ ఆ ఎలుక కరిచిన వ్యవహారం బయటకు రాలేదు. డాక్టర్ నే ఎలుక కరవడాన్ని సీరియస్ గా తీసుకున్న సూపరింటెండెంట్ ఏజెన్సీని గట్టిగా మందలించారు. ఎలుకలను సమర్థింగా నియంత్రించకపోతే ఒప్పందం రద్దు చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో.. ఏజెన్సీ అప్రమత్తమైంది. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.


          అయితే.. ఆసుపత్రుల్లో ఎలుకల సంచారం కొత్తకాదు.. గతంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు పసికందులను పీక్కుతున్న సంఘటనలు చూశాం. ఇప్పుడు చిన్నపిల్లల వార్డులో ఏకంగా డాక్టర్ నే కరిచిందంటే.. ఇక ఆ వార్డులో చికిత్స పొందుతున్న పసికందుల సంగతేంటి అని ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరి ఇప్పటికైనా అధికారులు మేల్కొంటారా.. లేదా.. అనేది వేచి చూడాలి.!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: