ఎడిటోరియల్: టిడిపి ప్రతినిధులు తమ అధినేత బాగోతాన్ని ఎందుకు ప్రశ్నించరు?

తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ ఒక చట్ట సభ సభ్యునిగా ప్రజలకు నాలుగేళ్ళ తరవాత మళ్ళా ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు కనిపించారు. ఆయన శైలి చూస్తే "తను చేస్తే శృంగారం అదే వేరే వాళ్లు అదే పని చేస్తే వ్యభిచారం" అనెలాగా ప్రవర్తించారు.

తెలుగుదేశం పార్టీ బాజపాతో పొత్తు పెట్టుకోవచ్చు కాని-వైసిపి పెట్తుకోకూడదా? మా ఖర్మ కొద్దీ రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే విపక్షం అసమర్ధతలో కూరుకుపోయింది. అందుకే మీ ఆటలు సాగుతున్నాయి. సిగ్గులేకుండా పార్టీ ఫిరాయింపులతో బ్రతికేస్తున్నారు.


సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంత పార్లమెంట్ సభ్యుల వ్యాపార లావాదేవీల ప్రభావమే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి ముందు రాష్ట్రం తన పరువు ప్రతిష్టలను కోల్పోయింది. రాజకీయం వీళ్లందరికి రక్షణ కవచం. వీరు చేసే వ్యాపార లావాదేవీలకు రాజకీయం ఒక ఆలంబన. అలాంటి వాళ్లలో వారే ఈ గల్లా జయదేవ్.

ఏ విధంగాను ఏ పార్లమెంట్ సభ్యునికంటే కూడా ఆయన ఉన్నతుడు కాదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ పక్షపాత, అంతకు మించి కుల మీడియా ఆయన్ని కులం కేంద్రంగా ఉన్నతుణ్ని చేయటానికి ప్రయత్నించింది. చివరికి “ఈనాడు” కూడా కుల ప్రభావం ముందు నిస్తేజమైంది  చిన్నబోయింది.


విభజన సమయంలో పార్లమెంట్ సమావేశాల చివరి అంకంలో వారి సహజ లక్షణమైన "నాటకం" ప్రదర్శిద్ధామని అనుకున్నారు అప్పుడు అది దెబ్బ కొట్టేసింది. ఇప్పుడు కూడా అలాంటి నాటకాలే ప్రదర్శిస్తున్న తెలుగుదేశ పంచమాంగదళాలు "జనాల చెవుల్లో సన్-ఫ్లవర్లు సరాసరి   పెట్టే పనులు చేస్తున్నారు" కారణం వాళ్ల మంత్రులు కూడా డ్రాఫ్ట్-బడ్జెట్ ను ఆమోదించిన వారిలో ఉన్నారు కదా! అంటే వాళ్లు ఆమోదించిన బడ్జెట్ నే  పార్లమెంట్ బయట సభ్యులు సిగ్గుమాలి దానికి వ్యతి రేఖంగా “ధర్నా నాటకాలు - పగటి వేషాలు” వేశారు.

గత నాలుగేళ్ల సంగతెలా ఉన్నా, ఒక్క పార్లమెంట్ ప్రసంగంతో గల్లా జయదేవ్ ను తెలుగుదేశం పార్టీకి, కమ్మ కులానికి మాత్రమే మద్దతిచ్చే అనుకూల మీడియా ఓ కథానాయకుణ్ని చేసి ఆయనకు సన్మానాలు కూడా చేశారు.


అయితే అటు టిడిపి, రాష్ట్రంలోని కమ్మేతరులు ఏమనుకుంటున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్ధకం మాత్రం కాదు. ప్రతి ఒక్కరూ ఈ వ్యవహారాన్ని హాస్యాస్పధంగా చూస్తున్నారు.  "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్" అని ఆయన ప్రసంగం మొత్తం చివరికి ఏమి సాధించింది? అదీ ప్రధాన ప్రశ్న. దానికేనా ఈ సన్మానాలు, ఇది కులగజ్జికి పరాకాష్ట కాదా? అసలు ఈ జయదేవ్ ఉపన్యాసం ద్వారా కేంద్ర కాబినెట్ సమిష్టి అమోదాన్ని ప్రశ్నించే ముందు కేంద్ర కాబినెట్ లోని తెలుగుదేశం మంత్రులు రాజీనామా చేసి ఉంటే గౌరవ ప్రధంగా ఉండేది. లేదా బడ్జెట్ ను ఆమోదించకుండా కాబినెట్ ను బహిష్కరిస్తే అటు కేంద్రానికి చెక్ చెప్పినట్లుండేది ఇటు పరువూ దక్కేది. జయదేవ్ గారి ప్రహసనం మొత్తం హాస్యాస్పధం. విఙ్జులెవరూ అభినందించరు.


ఇక మురళి మోహన్ గారి విచిత్ర వ్యాఖ్యానాలు దక్షిణ భారతం విభజన వరకు వెళ్ళారు ఎందుకు? కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మీరు మిత్రపక్షం. నిగ్గదీయండి.అది చేయలేక పోతున్నారంటే దానికి మీ బలహీనతలే కారణం. మీ స్వలాభాపేక్షను మీ పార్లమెంట్ సభ్యులు కొందరి బలహీనతలనైనా కేంద్రం గుర్తించింది అదీ మీ సమస్య. అందుకే ఈ రభస. ముఖ్యంగా మీ స్వప్రయోజనాలు దెబ్బతిన్నాయి. అందుకే ఈ యాగీ అంతా.

ప్రత్యేక హోదా వస్తే ప్రజలకు లాభం. ప్రత్యేక పాకేజీ వస్తే మీరు మీ ప్రభుత్వం మీ మీడియా పంచుకోవచ్చు. అందుకే అప్పుడు పాకేజీ కోసం కక్కుర్తి పడ్డారు. ఇప్పుడు టిడిపి ఏతర ప్రజల్లో టిడిపిపై విశ్వాసమే పోయింది. ప్రజలకు ఏ సమస్యా లేని 15 సంవత్సరాల వరకు రాజధానిగా హైదరాబాద్ ను వినియోగించుకొనే హక్కును వదిలేసిన చంద్రబాబు నాయుణ్ణి టిడిపి ప్రభుత్వాన్ని ముందు ఈ టిడిపి ఎమెల్యేలు, ఎంపిలు ప్రశ్నించండి.


ప్రత్యేక హోదా వదిలెయ్యవలసిన అవసరమేమొచ్చ్హిందని ముఖ్యమంత్రిని నిగ్గదీయండి అదీ గల్లా జయదేవ్ సారధ్యంలో.  అప్పుడు ఆయనకు సన్మానం చెద్ధాం. ప్రజలు హర్షిస్తారు.  పోలవరం అవినీతిలో ట్రాన్స్-ట్రాయ్ బాగోతమెంత? అక్కడ ప్రభుత్వ పెద్దల అవినీతి లోతెంత. వీటికి సమాధానాలు రాబట్టండి. అప్పుడు మీరు ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని విశ్వసిస్తారు సామాన్య ప్రజలు.

మురళి మోహన్ లాంటి సభ్యుల వల్ల పచ్చటి రాష్ట్రం నిట్టనిలువుగా విడిపోయింది. ఇక మీ స్వలాభాపేక్షకు బ్రేకులు పడటంతో ఇక దేశాన్ని విడగొట్టే పనిలో పడ్డారా? దీన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరూ కోరలేదు. మురళీ మోహన్ గారికోసం భారత్ ఉత్తర దక్షిణంగా విడిపోదు. చివరికి జాతీయ మీడియా కమ్మ కుల గజ్జిపై ప్రత్యేక వార్తలు రాసింది. మీకోసం మీ కుల స్వార్ధం కోసం దేశ విభజన కోరుతున్నారా? ప్రజలు నరెంద్ర మోడీ కంటే మిమ్మల్నే ఎక్కువ అసహ్యించుకుంటున్నారు.నిన్నటివరకు పవన్ కళ్యాణ్ ను విపరీతంగా మోసేసిన మీ మీడియా ఇప్పుడు ఆయన జెపి ఉండవల్లిలతో కలిసి మాట్లాడగానే ప్లేట్ ఫురాయించింది. సామాన్యుడు ఇప్పటికే మిమ్మల్ని మీకు మద్దతిచ్చే మీడియాని గుర్తించాడు. తస్మాత్ జాగ్రత్త!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: