లక్షలకోట్ల ప్రయోజనం వదిలేసిన అధినేతకు ఏ శిక్ష విధించాలి?

నరెంద్రమోడి అధినేతగా తెలుగువారికి చేసిన అన్యాయానికి తప్పని సరిగా బాధ్యుడౌతారు. రేపు ఆంధ్రప్రదేశ్ లో టిడిపి-బిజెపి రెండూ కలసి పోటీ చేసినా విడివిడిగా పోటీ చేసినా వారికి ధారుణపరాజయంతో కూడిన ఓటమి తప్పదు.


కాకపోతే ఊరికే పార్లమెంటులో మాట్లాడిన గల్లా జయదేవ్ ఈ రాష్ట్రానికి చేసిందేమిటి. వీళ్ళు అంటే జయదేవ్ లాంటి ఎంపిలు డిల్లీలో స్వంత వ్యాపారాలు పైరవీలు చేసుకుంటూ గతంలో కాంగ్రెస్ - ఇప్పుడు బిజెపి నేతల మోచేతి నీళ్లు తాగుతూ ఈ నాలు గేళ్ళు కాలం గడిపారు తప్ప రాష్ట్రప్రయోజనం ఏమీతీసుకు రాలేదు. తెలంగాణా విభజన పూర్తిగా ఆంధ్రా ఎంపిల అసమర్ధత వలన జరిగింది అనటంలో ఎలాంటి సందేహం లేదు.


ఇప్పుడు టిడిపి-బిజెపికి అవసానకాలం దగ్గరపడింది అందుకే "శవాలదగ్గర మరమరాలు ఏరుకునే తత్వం" తో ఈ రాజకీయ నాయకులు తప్పులు ఒకరిపై ఒకరు వేసుకుంటూ ఏదో రకంగా రానున్న 2019 ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారం లోకి రావాలని వీరి తాపత్రయం. అయితే ప్రజలు మూర్ఖులు కారన్నది గమనించాలి.


కొన్ని ప్రముఖ మీడియా సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని తమకు తగ్గట్టు వార్తలు రాయించుకుంటే సరిపోదు. "ఏ మీడియా హౌజ్ ఎవరి చంక నాకుతుందో" క్షుణ్ణంగా తెలిసిన తెలుగు వారు ఇక విఙ్జత పాటిస్థారు అనటంలో సందేహంలేదు. దౌర్భాగ్యపు బిజెపికి అంత్యకాలం దాపురించిందన్న దానిపై ఎవరికి అనుమానం లేదు.


పదేళ్ళు హైదరాబాద్ ను సంయుక్త రాజధానిగా వినియోగించుకోమన్న రాష్ట్ర విభజన ఉద్దేశం మరచి హైదరాబాద్ వదలి వేయటంలోని ఔచిత్యం ఏమిటి?


అప్పుడు కేంద్రానికి

డిల్లీ అంతటి రాజధానిని కట్టటానికి సరిపడా ఒక దశాబ్ధం సమయమైనా పట్టదా?

మహానగరాలు ఒక్క పదేళ్ళలో నిర్మించబడటాలు ఎక్కడైనా చూశామా?

అంత రాజధాని కట్టాలంటే పెద్ద మొత్తంలో వనరుల అవసరం ఉండదా?  

దానికి సమయం అవసరం ఉండదా?

ఆ సమయం మింగేసింది ఎవరు?

దానికి కారణాలు చూపించి ఇప్పుడు బాజపా తప్పించుకొంటే నష్టం ప్రజలకా?

తెలుగుదేశం పార్టీకా?  తెలుగుదేశం అధినేతకా?

టిడిపి అధినేత మెచ్చిన నచ్చిన మాహిష్మతీ నగర సినిమా సెట్టింగులతో నిర్మాణానికే రాజమౌళికి ఐదేళ్ళు పట్టింది. మరి నిజమైన అమరావతి అపరమాహిష్మతి ని నిర్మించాలంటే ఎవరికైనా 50 యేళ్ళైనా పడుతుంది. కాని అవసరాలకు తగిన


శాసనసభ భవనాలు,

సచివాలయ భవనాలు,

న్యాయస్థాన భవనాలు తదితరాలు క్రమంగా నిర్మిస్థారు అంతవరకు హైదరాబాద్ ను ఉపయో గించు కోవటంలో ఔచిత్యం ఉంది. హైదరాబాద్ ఈ స్థాయికి రావటానికి నాలుగు శతాబ్ధాలు పట్టింది.

ఇంతమంది తెలుగుదేశం వాళ్ళు అనేకం మాట్లాడుతున్నారు. ఈ విషయం గురించి అధినేతను నిగ్గదీయరేమిటి?

విభజన ఫలాలపై పోరాడే  గౌరవనీయులు చలసాని శ్రీనివాస్, సినీనటుడు శివాజి, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ దీని విషయంలో ప్రజల మద్య "తెలుగుదేశం పార్టీ అధినేత" ను నిగ్గదీయరేమి?


ప్రజలు కూడా దీనికి బాధ్యులే. 2019 ఎన్నికలప్పుడు నరెంద్ర మోడీ అద్భుత రాజధానిని నిర్మిస్తానని అంటంలో నాకు పదేళ్ళు సమయం ఉండటమే కారణం అనటం గ్యారెంటీ. అలాంటి లక్షల కోట్ల విలువైన ప్రయోజనాన్ని టిడిపి అధినేత ఎవరిని అడిగి వదిలేశారు?

మోడీని అడిగి చేశారా?

ఈ రోజు ఎల్.కే అద్వాని ఏపికి అన్యాయం జరిగిందని తెలుగుదేశం ఎంపిల సమక్షంలో ఒప్పు కున్నట్లు కొన్ని పచ్చ పత్రికలు వ్యాఖ్యానించాయి?

అది నిజమైతే దీనికి ఎల్.కె. అద్వానియే సమాధానం చెప్పవలసిన అగత్యం లేదా? ఆయన పూర్వాపరాలను చూడకనే మాట్లాడతారా? ఈ పత్రికల వార్తలను నమ్మేదెలా?

పార్టీ ఫిరాయింపులకు బార్లా సింహద్వారాలు తెరచిన తెలుగుదేశం అధినేత తెలంగాణాలో పోగొట్టుకున్న పరువు ప్రతిష్ఠ మాటేమిటి?

దీన్ని తెలుగువాళ్ళు ప్రశ్నించరా? ఐతే ఎందుకు ప్రశ్నించరు?


ఈ నష్టం విలువ ఒక లక్ష కోట్లైనా ఉండదా? ఇంతటి పాపాన్ని వదిలేసి బాజపా మోడీ ఏమీ చేయలేదనటం గల్లా జయదేవ్ మహనీయుని మాటల్లొని న్యాయమేమిటి?


పార్లమెంట్ లో అద్భుతంగా మాట్లాడటమే గొప్పైతే గల్లా జయదెవ్ కంటే భాషణలో ఇరగదీసే వాళ్ళు చాలామంది ఉన్నారు. విభజన సమయంలో సంయుక్త రాజధాని అవకాశం 5సంవత్సరాలు మాత్రమే అని మన్మోహన్ మహాశయులు అంటే కాదు కూడదని 10సంవత్సరాలు సంపాదించుకొని సంబరపడ్డ టిడిపి అధినేత ఆ ప్రయోజనాన్ని ఎందుకు అర్ధాంతరంగా వది లేశారు? ఈ ప్రశ్నకు సమాధానం   తెలుగుదేశం అధినేత నుండి రాబట్టి ఆపై కేంద్రప్రభుత్వంపై పోరాటం చేయటం మంచిది. అంతే కాదు ఈ క్రింది అంశాల్లో జరిగిన ధన నష్ఠం వనరుల మళ్ళింపుపై కూడా సి బి ఐ చేత విచారణ చేయించటం అత్యవ సరం కాదా?   


అమరావతి భూదందా

ఫైబర్గ్రిడ్ స్కాం

ఓటుకు నోటు కేసు

పొలవరంలో దాగుందన్న స్కాం

స్విస్ చాలెంజ్

వివిధ న్యాయస్థానాల్లో వివిధ కేసులపై 18 స్టేలు

ఏఏఐ టెండర్

రెండులక్షల కోట్ల  అప్పుల లెక్కలు  


అమరావతి పేరుతో అనేకదేశాలు అనేకమంది తిరిగి శంఖుస్థాపనలకు చేసిన దుబారా వ్యయం ఎవరి ఖాతాల్లొకి పోవాలో నిర్ణయించవలసింది ఏవరో ప్రజలకు చెప్పటం కూడా కేంద్ర ప్రభుత్వ భాధ్యతే దానికి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిగ్గదీయాలి కదా!


ఎందుకు గల్లా జయదేవ్ పై అంత మక్కువ? రాజ్యసభ నుండి సస్పెండ్ అయ్యేవరకు పోరాడిన కెవిపి రామచంద్రరావుకు ఆ గౌరవం వద్దా? వారిద్దరి మద్య వైరుధ్యమెందుకు? వర్గ పోరాటమా? అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమైఖ్యంగా విభజన ప్రయోజనాలకోసం పోరాడరా? వర్గాల వారీగా, పార్టీల వారీగా, కులాల వారీగా, పోరాడితే నరెంద్ర మోడీ ప్రభుత్వాన్ని వంచగలరా? 


విభజన ఫలాలకోసం జరిగే పోరాటం కుల ప్రాంత వర్గ పార్టీ రహిత సమైఖ్య ప్రయోజనాల కోసం ఇటు రాష్ట్ర నాయకత్వం నుండి కేంద్ర నాయకత్వం వరకు అందరిపై పోరాడాలి. రాష్ట్ర ప్రభుత్వ అధినేతను రెండులక్షల కోట్ల రాష్ట్రప్రభుత్వ ఋణం తో సృస్టించ సంపద లెక్కలు చూపేవరకు వదల కూడదు.




ఈ వ్యవహారంలో కేంద్రప్రభుత్వ అధినేత వైఫల్యం ఎంతుందో దానికి రెట్టింపు రాష్ట్రప్రభుత్వ అధినేత వైఫల్యమూ ఉంది. రాజ్యాంగబద్ధంగా రావలసిన విభజన ప్రయో జనాలను రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించి సాధించటం రాజ్యాంగ ప్రతినిధి గా రాష్ట్రాధినేత బాధ్యత. అవి వదిలేసి స్వార్ధ స్వంత ప్రయోజనాలకోసం పార్టీ ఫిరాయింపులు కుమారుణ్ని మంత్రిని చేయటం ఇలాంటి విషయాలపై శ్రద్ధపెట్టి ప్రజల సమయం, ధనం వృధా చేయటం అనేది అందరూ మాట్లాడుతున్నారు.



అంతేకాదు పోల వరం ప్రోజెక్ట్ లో కూడా అవినీతి జరిగిందని ఉండవల్లి అంతటివారు చెపుతున్నారు. అందుకే నేమో నరెంద్ర మోడీ అడుసులో కాలు పెట్టటం ఎందుకు ఆపై కడుక్కోవట మెందుకు అనే ఆచి తూచి అడుగు వెయ్యటమో? లేక చర్యలకు అవ కాశాలు పరిశీలిస్తూ ఉండటం జరుగుతుండవచ్చని పెద్దలే అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: