రాహూల్ గాంధీ పోస్టర్ల కలకలం..!

Edari Rama Krishna
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్ ల మద్య మాటల యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహూల్ గాంధీ  ప్రధాని మోదీపై పలు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే..కానీ ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజయం మాత్రం దక్కించుకోలేక పోయారు.  మరోవైపు ప్రధాని మోదీ తన అభివృద్ది మంత్రమే బీజేపీ గెలుపునకు బాటలు వేస్తున్నాయని..ఎవరెన్ని కామెంట్స్ చేసినా..తాను లెక్కచేయబోనని అంటున్నారు. 

అయితే రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిలోకి వచ్చినా...కొన్ని సార్లు తొందరపాటు వ్యాఖ్యలు, పనులతో సోషల్ మీడియాలో అడ్డంగా బుక్ అవుతున్న విషయం తెలిసిందే.  తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన నియోజకవర్గం అమేథీలో పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ వెలసిన పోస్టర్ల కలకలం రేపుతున్నాయి.   

రాహుల్‌ను రాముడిగా, ప్రధాని నరేంద్ర మోదీని రావణుడిగా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ శ్రేణులు అక్కడ పోస్టర్లు ఏర్పాటు చేశారు. రావణుడు(మోదీ)పై రాముడు(రాహుల్‌) బాణాలు ఎక్కుపెట్టినట్టుగా పోస్టర్‌లో చూపించారు. అంతే కాదు  2019లో రాహుల్‌ గాంధీ దేశంలో రాహుల్‌ రాజ్యం(రామ రాజ్యం) తీసుకొస్తారంటూ పోస్టర్లు పెట్టారు. 

మరోచోట రాహుల్ గాంధీ  మహాభారతంలోని శ్రీకృష్ణుడి అవతారంలో చూపిస్తూ..కాంగ్రెస్ దశ, దిశా నిర్ణయించే యోధుడు యోధుడు ప్రయాణం మొదలు పెట్టాడని ఈ పోస్టర్లపై రాశారు.  అయితే ఇవన్నీ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర పనులు అని..ఎవరి గెలుపు ఎవరు నిర్ణయిస్తారో భవిష్యత్ లో ప్రజలే నిర్ణయిస్తారని..కాంగ్రెస్‌ పోస్టర్లపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: