భారతీయ ఐటి నిపుణులకు శుభవార్త - అమెరికాలో గ్రీన్-కార్డ్ కోటా పెంపు

అమెరికాలో గ్రీన్‌కార్డుల కోసం నిరీక్షించే ఆశావహులకు అత్యంత శుభకర శుభవార్త. అక్కడ ఉద్యోగంతో పాటు శాశ్వత స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు దోహదపడే గ్రీన్‌కార్డు విడుదల సంఖ్య దాదాపు 40 శాతానికి పైగా పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఇది ముఖ్యంగా అమెరికాలో శాశ్వత స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటు న్న భారతీయ ఐటీ-సాకేతిక నిపుణులకు సంతృప్తి కలిగించే ప్రకటన వెలువడనుంది.

ప్రతిభ ఆధారిత వలస విధానం (మెరిట్ బెస్డ్ మిగ్రేషన్ సిస్టం) ప్రోత్సహిస్తూ సంవత్సరానికి 45శాతం గ్రీన్‌కార్డులను ఇచ్చేలా అమెరికా ప్రతినిధుల సభలో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఒకవేళ ఈ చట్టం అమల్లోకి వస్తే గ్రీన్‌కార్డుల సంఖ్య ప్రస్తుత సంవ త్సరానికి 1,20,000నుంచి 1,75,000 వరకు పెరిగే అవకాశం ఉంది. "అమెరికా భవిష్యత్‌ భద్రత చట్టం" (సెక్యూర్ అమెరికా ఫ్యూచర్‌ యాక్ట్‌) పేరున డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం చేపట్టిన ఈ చట్టాన్ని అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదిస్తే గ్రీన్‌కార్డుల మంజూరీకి ఒక రూపం సంతరించుకుంటుంది. దీంతో ఏటా సంవత్సరానికి వచ్చే వలసదారుల సగటు తగ్గే అవకాశం ఉంది.

 గ్రీన్‌కార్డు కోసం ఏటా సుమారు 5 లక్షల మంది భారతీయులు తాత్కాలిక హెచ్‌-1బీ వీసాను పొడిగించుకుంటున్నారని సమా చారం. మరో వైపు ప్రతిభావంతులైన అమెరికన్‌ నిపుణులు కొరత కారణంగా కొన్ని కంపెనీలు తాత్కాలిక హెచ్‌-1బీ వీసాల పేరు తో విదేశీ నిపుణుల మీద ఆధారపడాల్సి వస్తోంది. అమెరికన్‌ ప్రభుత్వం గ్రీన్‌కార్డుల సక్రమం గా ఇవ్వటాన్ని ఏటా కొనసాగిస్తే ప్రతి సారీ ఈ వీసా పొడిగింపుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.

"ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే అన్ని రకాల సమస్యలూ పరిష్కారమవుతాయి. అంతర్గతంగానూ బలోపేతం అయ్యే అవ కాశం ఉంది. వలస సంబంధిత చట్టాలను ఉల్లంఘించాలనుకునే వారికి ఇకపై కఠిన నియమాలు వర్తిస్తాయి" అని మిచెల్‌ మేకాల్‌, అమెరికా భవిష్యత్‌ భద్రత చట్టం కమిటీ చైర్మన్ అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఒకరిద్వారా మరొకరు వలస రావడం (చైన్‌ మైగ్రేషన్‌ విధానం) పై కాస్త ప్రభావం పడుతుంది. అంటే భారత్‌ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులు (టెక్కీలు) అమెరికాలో స్థిరపడి ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులను అమెరికాకు తీసుకు వస్తుంటారు. గొలుసుకట్టు వలస విధానాన్ని  ఎత్తివేయాలని అందులో ప్రతిపాదించడం వల్ల జీవిత భాగస్వామి, మైనర్‌ పిల్లలు మినహా మిగతా కుటుంబ సభ్యులను అమె రికాకు తీసుకెళ్లడం కుదరదు.

అయితే గ్రీన్‌కార్డు కలిగి ఉన్న పౌరులను కలుసుకునేలా వారి తల్లిదండ్రులకు  పునరుద్ధరించడానికి వీలుపడే తాత్కాలిక వీసా కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు. వ్యవసాయ కార్మికులు తాత్కాలికంగా అక్కడికి వెళ్లి పనిచేయడానికి వీలు కల్పించే కార్య క్రమాన్ని కూడా బిల్లులో ప్రతిపాదించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం విదేశీ కార్మికుల సేవలు వాడుకు నేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కానీ ఈ చట్టంలో వారి బంధువులకు ఇకపై గ్రీన్‌కార్డ్ ఇవ్వకూడదని ప్రతిపాదించారు. కేవలం వారి పిల్లలకు, తోబుట్టులకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. ఇంకా వ్యవసాయ సంబంధిత పనులు చేసే శ్రామికుల కోసం మరో పథకాన్ని అమెరికా ప్రతిపాదిస్తుంది. వ్యవసాయం ద్వారా కూడా తమ ఆర్థిక వ్యవస్థను పెంచుకోవాలని వారు భావిస్తున్నారు. "అన్ని రకాలుగా ఆలోచించి ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సరిహద్దు భద్రతను పెంచేలా శాసన వ్యవస్థ ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు" కమిటీ సభ్యుడు తెలిపారు. "అమెరికా ప్రజలకు ప్రధాన ప్రాధాన్యతను యివ్వలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్‌ విధానాలకు అనుగుణంగా ఈ చట్టం ఉంటుందని" శ్వేత సౌధం (వైట్‌హౌస్‌) ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: