మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..కోర్టుకు హాజరైన యాంకర్ రవి..!

siri Madhukar
ఈ మద్య బుల్లితెరపై వస్తున్న యాంకర్లు ఎన్నో కాంట్రవర్సీలో పడుతున్నారు.  రీసెంట్ గా యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా బుక్ కావడం..తర్వాత కనిపించకుండా పోవడం..సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  మొత్తానికి సోమవారం తన తండ్రితో కలిసి కౌన్సిలింగ్ కి హాజరయ్యారు.  ఇదిలా ఉంటే 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో ఫంక్షన్‌లో మహిళలను కించపరుస్తూ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను అతను సమర్థించాడు. దీంతో ఆయనపై ఓ మహిళ గతంలో కేసు పెట్టింది. 

యాంకర్ రవి ‘పటాస్’ తో బాగా పాపులర్ అయ్యారు..ఆ మద్య ఈ ప్రోగ్రామ్ పై కూడా ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి.  యాంకర్ శ్రీముఖితో మనోడి వ్యవహారం శృతి మించిందని నెటిజన్లు కామెంట్ చేయడం..తర్వాత తమ మద్య ఏమీ లేదని ఇద్దరూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.  తాజాగా యాంకర్ రవి బుధవారం కోర్టుకు హాజరయ్యారు.   ‘రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో ఫంక్షన్ లో మహిళలను కించపరుస్తూ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యకు రవి ఇచ్చిన రెస్పాన్స్ వివాదం అయ్యింది.  దీంతో ఆయనపై ఓ మహిళ గతంలో కేసు పెట్టింది.

ఈ నేపథ్యంలో కోర్టు వాయిదా బుధవారం ఉండటంతో రవి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది.  కోర్టుకు హాజరైన అనంతరం రవి విలేకరులతో మాట్లాడుతూ..ఆ రోజు అన్న పూర్ణ సెవెన్ ఏకర్స్‌లో ‘రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. నేను గీత యాంకరింగ్ చేస్తున్నాం. డైరెక్టర్ మాకు ఇన్ ఇయర్ పీస్ ఇస్తాడు. తాను ఏమైనా ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటే దాని ద్వారా మాకు చెబుతాడు. ‘రారండయ్ వేడుక చూద్దాం' సినిమా స్టార్టింగ్ నుండి ట్రైలర్లో నాగ చైతన్య గారు ఓ మాట అన్నారు.

ఆడవాళ్లు మనశ్శాంతికి హానికరం అని ఓ డైలాగ్ చెప్పడం జరిగింది. టీం మొత్తం ఆ వర్డ్ ను వాడుకోవాలని, అదే ఇంటరాక్టివ్ ఎంటర్టెనింగ్ గా ఫన్ గా సాగాలని చెప్పారు. ఈ పాయింట్ పై యాంకర్ గీత నటుడు చలపతి రావు వద్దకు వెళ్లి ఆడవాళ్లు మనశ్శాంతికి హానికరమా అన్న ప్రశ్నకు ఆయన వారు పక్కలోకి పనికొస్తారు అని వ్యాఖ్యానించారు..అక్కడే ఉన్న యాంకర్ రవి సూపర్ అని అన్నారు. దీనిపై ఇద్దరిపై మహిళా సంఘాలు అగ్గిలంమీద గుగ్గిలం అయ్యారు. నిజంగా చలపతి రావు అన్న కామెంట్స్ నాకు వినిపించలేదు అని యాంకర్ రవి అంటున్నారు. 

నేను ఆ మాట అనుంటే నేనే తలొంచుకుని సిగ్గుపడే వాడిని. చలపతి రావు అన్న మాట నాకు వినపడలేదని చెప్పినా... ఎవరూ విపించుకోరు, అర్ధం చేసుకోరు. కొన్ని విషయాల్లో మనం ఏమీ చేయలేమని యాంకర్ రవి తెలిపారు. చలపతిరావుగారు అన్న మాటకి మహిళా సంఘాలు హర్ట్ అయ్యారు. ఆ ప్లేసులో ఎవరున్నా హర్ట్ అవుతారు. మహిళలు అంటే మా అమ్మే గుర్తొస్తుంది. మహిళా సంఘాలు ఇలా రియాక్ట్ అవ్వడంలో తప్పులేదు. దయచేసి నా మాటలు తప్పుపట్టొద్దని మరోసారి మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: