ఎడిటోరియల్: చంద్రబాబు కౌటిల్యం - ఒక దెబ్బతో టిడిపికి వైభవం-బాజపాకు వైఫల్యం

భారతదేశం కోసం అంటే జన్మభూమి కోసం, ప్రజలకోసం సహస్రాబ్ధాలకు సరిపడా అర్ధశాస్త్ర పరిఙ్జాన్ని, రాజనీతిశాస్త్రాన్ని,ధర్మ అర్ధ కామ్య మోక్షాలను అపురూపంగా వివ రించారు తన అర్ధశాస్త్రం అనే గ్రంధంలో. ప్రజల కొసమే ధన మాన ప్రాణాలను ఫణంగా పెట్టాడు కాబట్టే ఆయన్ను చాణక్యుడు అన్నారు. ఎంతగానో రాజకీయాలు చేస్తూ ప్రతి ప్రజా ప్రోజెక్టులో దక్కే కమీషన్ల కోసం రాష్ట్రం ప్రజలెంత పరితపిస్తున్నా లక్ష్య పెట్టక అసమర్ధ గుత్తేదార్లతో కుమ్మక్కై ప్రజలకు దేశానికి తన విద్రోహ చింతనతో నష్ట పరచే పాలకులను "కుటిలుడు" (రు) అనటం సరిగ్గా సరిపోతుంది.


రాజ‌కీయ చ‌తురుడనే పేరున్న( చాణక్యుడు అనటం ఏమాత్రం సమంజసం కాదు. కారణం చాణక్యుడు దేశంకోసం తనను తానే ఫణంగా పెట్టాడు ఇక్కడ ఈ నాయకులు తమ స్వార్ధరాజకీయాలకు ప్రజలను ఫణంగా పెడుతుండటంవలన) ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు (అ)రాచకీయ వ్యూహాల‌తో ప్ర‌తిప‌క్ష నేత‌లు, ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఇరకాటంలో ప‌డే సంగ‌తి తెలిసిందే.


అయితే తాజాగా ఆయ‌న తీసుకున్న “కాపుల‌కు రిజ‌ర్వేష‌న్” నిర్ణయంతో మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీని అడ్డంగా బుక్ చేశార‌ని చెప్తు న్నారు. ఈ ఎపిసోడ్‌లో  “కీర్తివస్తే బాబుకు, అపకీర్తి వస్తే మోడీ” కి  అనేలా బాబు నిర్ణ‌యంఉంద‌ని విశ్లేషిస్తున్నారు. అయితే ఇక్క‌డే బాబు త‌న‌దైన శైలిలో వ్యూహంప‌న్నార‌ని అంటున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన చంద్ర‌ బాబు ఈ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిన బాధ్యతను నేర్పుగా కేంద్రంలో ఉన్న‌ బీజేపీపైనే పెట్టారు. త‌ద్వారా ఇక‌నుంచి కాపుల రిజర్వేషన్ చట్టబద్ధతపై ఎవరు మాట్లాడినా, ముందు బీజేపీని నిలదీసే పరిస్థితి కల్పించారు.


2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు కాపుల‌కు “బీసీ రిజ‌ర్వేష‌న్”  హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ హామీ నిలుపుకోవ‌డం విష‌యంలో దాదాపు మూడున్న‌ రేళ్లు జాప్యం చేశారు. గత ఎన్నికల్లో కాపువర్గాలు కాంగ్రెస్‌పై వ్యతి రేకత, బాబు ఇచ్చిన హామీ, పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమానంతోనే టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాయి. తర్వాత 9 నెల లైనప్పటి కీ దానిపై కదలిక లేకపోవడంతో ముద్రగడ పద్మనాభం ఉద్యమం ప్రారంభించారు.


తునిలో భారీ సభ నిర్వహించిన సందర్భంలో అది హింసాత్మకంగా మారింది. అందులో పాల్గొన్నారన్న అనుమానంతో పోలీసులు 13 జిల్లాల్లోని కాపు యువకులకు పోలీసు స్టేషన్లకు పిలిపించి హింసించడం, కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరో పించిన ముద్రగడ, దీక్షలకు సిద్ధం కావడంతో టీడీపీపై కాపుల్లో వ్యతిరేకత మొదలయింది. ముద్రగడ అరెస్టుతో వ్యతిరేకత మరింత పెరిగింది. ముద్ర గడ ఉద్యమానికి అటు వైసీపీ కూడా బహిరంగ మద్దతు ప్రకటించింది.


ముద్రగడ దీక్ష వల్ల ఆయన ఇమేజ్ పెరగకపోయినా కాపు యువతను బాబు వ్యతిరేకదారిలో మళ్లించడంలో మాత్రం ముద్రగడ విజయంసాధించారు. ఆ వ్యతిరేకతను తగ్గించడానికి బాబు కాపు మంత్రులు,నేతలను ముద్రగడపై ప్రయోగించాల్సివచ్చింది. అయితే ఈ ఎత్తులు పై ఎత్తుల‌కు చెక్ పెడుతూ సీఎం చంద్ర‌బాబు కాపు కోటాకు మోక్షం క‌ల్పించారు తాము కాపుల కోసం రిజ ర్వేషన్ కల్పించామని, దానికి చట్టబద్ధత కల్పించాల్సింది కేంద్రమే కాబట్టి, అంతాకలసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని లౌక్యం గా చెప్పి తప్పించుకుని, బీజేపీని తెరపైకి తీసుకువచ్చే చాణక్యమే (కుటిలత్వం) ఈ వ్యూహంలో కనిపిస్తోంది.


ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్లుగా, మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర అవసరాలు తీర్చడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీనీ, బాబు ఈ వ్యవహారంలో వ్యూహాత్మకంగా ఇరికించారు. ప్ర‌స్తుత ఎపిసోడ్‌లో కాపు కోటాకు మ‌ద్ద‌తిస్తే, బిల్లుకు ఆమోదం క‌ల్పిస్తే, క్రెడిట్  టీడీపీకి వ‌స్తుంది. ఒక‌వేళ బీజేపీ ఈ విష‌యాన్ని పెండింగ్ లో పెట్టినా ఒకవేళ కాదన్నా ఆ పార్టీకే కీడు జరుగుతుంది.  అంటే లాభం బాబు ఖాతాలోకి, న‌ష్టం బీజేపీకి, ద్రోహం ప్రజలకి జరిగిపోతుందని అన్నమాట‌. ఇటు రాజ‌కీయ ప్ర‌యో జ‌నాలు కాపాడుకుంటూనే ఇటీవ‌లి కాలంలో త‌న‌కు స‌హ‌క‌రించ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని బీజేపీని బాబు దెబ్బ‌తీశాడ‌ని అంటున్నారు.


అయితే కాపులపై వేసిన కాపు కమీషన్ అధిపతి మంజునాధ సంతకం చేయని నివేదికను సభ్యులు అందించగా దాన్ని శాసన సభలో ఆదరా బాదరా గా ఆమోదింపజేయటం లోని మర్మం తెలుసుకోనంత అమాయకుడు కాదు మోడీ. అసలే  "ఆరెసెస్ -థింక్-టాంక్"  నుండి ప్రధానైన మోడీ ఎలాంటి "కౌటిల్యం" ప్రదర్శిస్తాడో అని జనం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే శరపరంపరలు చంద్రబాబుపై ఉండవల్లి అరుణకుమార్ కురిపిస్తూనే ఉన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: