ఆమ్‌-ఆద్మీ-పార్టీ ఆశల్లో నీళ్ళు పోసిన రఘురాం రాజన్

డిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, అరవింద్ కేజీవాల్ ఇవ్వజూపిన రాజ్యసభ సీటును భారత కేంద్ర బాంక్  (RBI) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు ఎంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని వదిలిపెట్టి రాజ్యసభ సభ్యుడిగా పనిచేయలేనని రఘురాం రాజన్‌ పేర్కొన్నారు. 


అయితే నిన్ననే ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన ఆఫర్‌పై రఘురాం రాజన్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రఘురామ్‌ రాజన్‌ అధ్యాపక వృత్తి లో మమేకమై ఉన్నారని, భారత్‌ లో కూడా విభిన్న విద్యా కార్య కలాపాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారని కార్యాలయం ప్రకటించింది. "యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో" లో ఆయన పూర్తి స్థాయి అధ్యాపకుడిగా కొనసాగేందుకే ఇష్టపడుతున్నట్లు ఆయన కార్యాలయం స్పష్టం చేసింది.


కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ముగ్గురు సభ్యులను జనవరిలో రాజ్యసభకు పంపనుంది. ఈ మూడు స్థానాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలను కాకుండా, ఆయా రంగా ల్లో నిష్ణాతులను పంపాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే రఘురామ్‌ రాజన్‌ను రాజ్యసభ కు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ఆశిష్‌ ఖేతన్‌ ట్విటర్‌లో వెల్లడించారు.


రఘురాం రాజన్ బహుశ భారత కంపు రాజకీయాలను భరించ లేకనే ఈ అవకాశాన్ని వదిలేసుకుని ఉండవచ్చు. ఇక మాతృభూమికి సేవ అంటారా? ఆయన విద్యా రంగం ద్వారా విభిన్న కార్య కలాపాలను ప్రారంభిస్తాననే చెపుతున్నారు కదా! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: