అనంతలో జలకళ..వెల్లివిరిసన ఆనందం..!

veeru

ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌.. రాష్ట్రమంతా కుంభవృష్టి కురుస్తున్నా చుక్కనీటికోసం ఆశగా ఆకాశం కేసి చూసే జిల్లా అది. అటు వరుణుడు, ఇటు చంద్రుడు కరుణించడంతో ఇప్పుడు అనంతపురం జిల్లా జలకళతో కొత్త అందాన్ని సంచరించుకుంది. అటు కృష్ణ, ఇటు తుంగభద్ర మరోవైపు హంద్రీనీవా నుంచి పుష్కలంగా నీరు చేరడంతో ఎడారి కాస్తా కోస్తాను తలపిస్తోంది. ఒకప్పుడు అనంతపురం జిల్లా.. ఎడారి జిల్లాను తలపించేది. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు.


20 రోజులుగా కురిసిన వర్షాలతో... జిల్లాలో అనేక చెరువులు నిండిపోయాయి. శ్రీశైలం నుంచి.... జీడిపల్లి రిజర్వాయర్‌ మీదుగా.. కృష్ణ జాలాలు రావడంతో.... ధర్మవరం చెరువు జలకళ సంతరించుకుంది. 9 ఏళ్లుగా.... నీటి చుక్కలేకుండా ఉన్న ఈ చెరువు... ఇప్పుడు నిండే పరిస్థితికి చేరుకుంది. బైరావాని తిప్ప ప్రాజెక్ట్‌ సైతం నిండిపోయింది. బుక్కపట్నం చెరువులోనూ నీటి ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు. తుంగభద్రకు వరద పెరగడంతో నవంబర్‌ ఒకటి నుంచి  జిల్లా వాటా కింద 30 టిఎంసీల నీళ్లు ఇచ్చేందుకు అధికారులు సన్నద్దమయ్యారు. 


వరుణుడు కరుణించినా ఈస్థాయిలో వరదనీరు ఒడిసిపట్టడం వెనక మాత్రం చంద్రబాబు నాయుడి వ్యూహమే ఉంది. శ్రీశైలానికి నీరు రాగానే జిల్లాలోని చెరువులకు నీరు మళ్లించారు. ఆ నీటితో ఇప్పుడు అవి కళకళలాడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నీటిదొంగ అంటూ విమర్శలు గుప్పించినా, ప్రతిపక్షపార్టీనే అడ్డుకోవాలని చూసినా బాబు పట్టించుకోలేదు.


దీనికితోడు అనంత జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని నీటిగుంటల తవ్వకానికి శ్రీకారం చుట్టారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసినా పట్టించుకోలేదు. ప్రతిచుక్కనీటిని ఒడిసిపట్టేలా వీటిని నిర్మించారు. తాజా వర్షాలతో ఆ నీటికుంటల ఉపయోగం ఏంటో అందరికీ తెలిసొచ్చింది. భూగర్భ జలాలలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: