ఎడిటోరియల్: తెలంగాణా బాహుబలి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రకంపనలు

అంధ్రప్రదేశ్ లో పూర్తిగా చచ్చిపోయి, తెలంగాణాలో కొన ఊపిరితో మిగిలున్న కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి లాంటి యువనాయ కత్వం జవసత్వాలు చేకూర్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వెలమ కమ్మ అంటూ తెలంగాణాలో వెల్కం అంటూ కేసిఆర్ చెప్పకనే చెప్పినట్లు ప్రజలందరికి అర్ధమైంది. లోపల రగిలే కులగజ్జి కొన్నికులాల్లో ఉన్నా ఏపిలో లాగా తెలంగాణాలో కులాల పై చర్చ బహిరంగంగా ఉండదు. కేసిఆర్ అనంతపూర్ పరిటాల రవీంద్ర కుమారుని పెళ్ళికి వెళ్లిన సందర్భంగా ఈ దరిద్రం తెలంగాణాకి అంటుకుంది. ప్రజలు ఈ విషయం లో వెలమలకు రానున్న ఎన్నికల్లో "సరైన స్ట్రోక్"  ఇస్తారనే వాదనబలంగా వినిపిస్తుంది. తెలంగాణా వాసులు ఈ ఆంధ్రా దురద వద్దనే కోరుకుంటారు.




1. ఇప్పటికే మత,  కుల సంఘాలకు ఆర్ధిక సహకారం వేరు వేరుగా అందిస్తూ సమాజాన్ని కలుషితం చేయటం ప్రతిరోజు కనిపిస్తూనే ఉంది. 

2. ప్రొ. కోదండరాం నిస్వార్ధపరుడు నిజాయతీపరుడని తెలంగాణా వాసులు చాలా మంది విశ్వాసం వెలిబుచ్చుతున్నారు. అలాంటి వ్యక్తిని అసభ్యపదజాలంతో తిట్టటం కేసిఆర్ స్థాయిని నేలకు దించింది. ఆయన మాటల మంత్రాలకు పడిపోయేవారు కూడా ఈ విషయం లో  "కెసిఆర్ - ఎంతకైనా దిగజారగలడని"  బహిరంగంగానే అంటున్నారు.

3. ఇంతవరకు సార్వం సహా రాష్ట్ర వ్యాప్త అధికారాన్ని తన తన కుటుంబ గుప్పిట్లో పెట్టుకొనటం ప్రజాస్వామ్య తెలంగాణా వాదులకు నచ్చట్లేదనేది నిర్వివాదాశం. ప్రతి పక్షానికి మగతనం మనుగడ రెండూ లేవనేది జగమెరిగిన సత్యం. అందుకే కెసిఆర్ కొనసాగుతున్నడని లేకుంటే ఆయన ఒంటెత్తు పోకడలకు ఎప్పుడో శంకరగిరి మాన్యాలు పట్టిపోయేవాడని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నిబిడీకృతమైన భావన. 

4. అభివృద్దిలేని జంటనగరాలు ఆవాసయోగ్యం కూడా కాకపోవటం తెలంగాణా ఏర్పాటైన తరవాతే కనిపిస్తుంది, అదీ టిఆరెస్ పాలనలోనే. పట్టణవాసులకు పూర్తిగా ఇది రుచించదు.

5. రాష్ట్రంలో అనవసరమైన "ప్రగతి భవన్, నూతన సచివాలయం" లాంటి నిర్మాణాలను ప్రజలు కోరుకోవట్లెదు. అర్ధిక క్రమశిక్షణ తప్పిన "సర్-ప్లస్ బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రం"  అప్పుల ఊబిలో కూరుకుపోవటం ప్రజల్లో ఆందోళనకు దారితీస్తుంది. 

6. ప్రజలకిచ్చిన వాగ్ధానాలేవీ నెరవేర్చక కుండా "మాటల మాయ" వర్ణాలు, వెలిసిపోటానికి సమయం ఎక్కువపట్టదు అంటున్నారు ప్రజలు. దీనికి తార్కాణాం జంటనగరాల రోడ్ల పరిస్థితి, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని కుక్కలా కాపుకాస్తానన్న మాటలు ఆయన మాటలే. 




ఇలాంటి పెద్ద లిస్టే ఎక్కడైనా తెలంగాణాలో నలుగురు కనపడితే వినిపించే కథనాలు.  ఈ సందర్భాల్లో రెవంత్ రెడ్డి లాంటి "దూసుకెళతా!" అనే వ్యక్తికి అవకాశం వస్తే ప్రతి పక్షానికి మగతనం అబ్బినట్లే. ఇందుకు సంబంధించిన చర్చలు తుది  దశలో ఉన్నయని దేశ రాజధానిలో నుండి వినిపిస్తున్న మాట. "పార్టీని బలోపేతం చేసుకోనే లక్ష్యం తో రేవంత్ రెడ్డిని కాంగ్రేస్ లో చేర్చుకోవడం పట్ల కాంగ్రెస్ హై కమాండ్ అత్యంత ఆసక్తి తో ఉంది" అని వార్తల సారాంశం.



ప్రస్తుతం రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో సహా కాంగ్రెస్ ముఖ్యు లంతా దేశ రాజ ధానిలో మకాంపెట్టారు. టీ-పీసీసీ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా ఆధ్వర్యంలో జరిగేచర్చల్లో రేవంత్ రెడ్డి తన డిమాండ్లను తెలియజేయగా, హై కమాండ్ స్పందన కోసం ఎదురుచూస్తున్న సమాచారం. "తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి" లేదా "ప్రచార కమిటీకి అధ్యక్ష పదవి" వంటి కీలక హోదాను తనకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రధాన డిమాండ్ అని  సమాచారం. హై కమాండ్ కూడా రేవంత్ నుంచి వినిపిస్తున్న ఈ డిమాండ్లపట్ల, మరియు నల్లగొండ ఎంపీ సీటును కేటాయించ టానికి సానుకూలంగానే ఉందని సమాచారం. 




అయితే రేవంత్ పై కొంతమంది కాంగ్రెస్నాయకులు ఇప్పటికే ఫిర్యాదులు మొదలుపెట్టినట్టు సమాచారం.  రేవంత్ "ఓటుకు నోటు కేసు" లో నిందితుడై, వీడియోల్లో అద్భుతం గా చిక్కిన వ్యక్తి,  కాబట్టి తను ఇప్పుడు చేరితే పార్టీకి నష్టమే అని వారు అధి ష్టానానికి నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.



అయితే పైకి మాత్రం ఇరువర్గాలూ ఏం మాట్లాడటం లేదు. తను కాంగ్రెస్ హై కమాండ్ తో చర్చలేమీ జరపడంలేదని, "తెలంగాణ రాష్ట్ర సమితి"- తెరాస పై కేసువేయడానికి ఢిల్లీకి వచ్చానని రేవంత్ అంటున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఈ వ్యవహారంపై ఏమీ స్పందించడం లేదు. మరి కొన్ని గంటల్లోనే ఈ వ్యవహారం పై పూర్తి స్పష్టత లభించే అవకాశాలున్నాయి పుష్కళంగా ఉన్నాయి.  దీంతో అటు కెసిఆర్ ఇటు చంద్రబాబు మొత్తంగా వెల్కం కు గుండుసున్న,  అయితే మాత్రం  తెలంగాణాలో ఆంధ్రా కాంట్రాక్టర్ల కు   భవిష్యత్ అంతా గడ్డుకాలమే. కాంగ్రెస్ బలపడితే తెరాసకు దినదిన గండమే అంటు న్నారు.  అలాగే,  తెలంగాణాలో తెలుగుదేశం చరిత్రలో కలిసిపోయే అవకాశాలే ఎక్కువ. 


టీఆర్‌ఎస్‌తో పొత్తును టీడీపీలోని ఓవర్గం సమర్థిస్తుండడంతో మరోవర్గం తమ దారి  తాము  వెతుక్కుంటోంది. ఇదే జరిగితే భవిష్యత్‌లో రాష్ట్రంలో,  నల్గొండ జిల్లాలో టీడీపీ దుకాణం బంద్‌ కావడం ఖాయమని భావిస్తున్న నేతలు రేవంత్‌రెడ్డి బాటలో పయనించేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రేవంత్‌రెడ్డి అనుచర నేతలు ఆయనతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణను నిర్దేశించుకున్న తర్వాతే కాంగ్రెస్‌లో చేరేందుకు జైకొట్టినట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: