పాప్ సింగర్ మడోన్నాకు ఘోర అవమానం..!

Edari Rama Krishna
ఈ మద్య అమెరికాలో భారతీయులకే కాదు భారతీయేతరులకు కూడా ఘోరంగా అమానాలు జరుగుతున్నాయి.  కొంత మంది అమెరిక్లు భారతీయులపై వ్యతిరేఖతతో నిర్ధాక్షిణ్యంగా చంపిన ఘటనలు కూడా ఉన్నాయి.  ఆ మద్య అమెరికన్ ఎయిర్ పోర్ట్ లో మన భారతీయ సినీ నటులకు కూడా ఘోర అవమానాలు ఎదురయ్యాయి.  తాజాగా తన గానంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించే పాప్ సింగర్ మడోన్నాకు ఘోరంగా అవమానం జరిగింది.  

డెలివరీ సర్వీస్ సంస్థ ఫెడెక్స్ ఆమెకు వచ్చిన ఓ పార్శిల్ ని ఇవ్వడానికి నిరాకరించింది..అంతే కాదు అసలు నువ్వు మడోన్నావే కాదో పో అని ఘోరంగా అవమానించారు.  దీంతో చిర్రెత్తుకొచ్చిన మడోన్నా తన కోపమంతా ట్విట్టర్ లో వెల్లబుచ్చింది.  తానంటే ప్రపంచం మొత్తం ఎలా స్పందిస్తో..కానీ చిన్న పార్శిల్ సంస్థవారు ఇంత ఘోరంగా అవమానిస్తారా అని ఆవేదన వ్యక్తం చేసింది.  

దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు రక రకాలుగా స్పందించడం మొదలు పెట్టారు. దో కఠినమైన ప్రపంచమని, ఇక్కడంతేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే.. ఇదంతా ప్లాస్టిక్ సర్జరీ తెచ్చిన తంటా వల్లేనని వ్యాఖ్యానిస్తున్నారు.  ట్విస్ట్ ఏంటంటే..ఫెడెక్స్ ఉద్యోగి ఒకరు.. డెలివరీ అడ్రస్‌తోపాటు ఫోన్ నంబరును పంపాలని ట్వీట్ చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: