జగన్ పట్టుబట్టిన పంతం... మంత్రి రజనీ నెరవేరుస్తుందా..?
రజనీని జగన్ ఎప్పుడో రెండు నెలల ముందే వెస్ట్ సీటుకు పంపారు. అప్పటి నుంచి ఆమె నియోజకవర్గంలో జెట్ రాకెట్ స్పీడ్‌తో దూసుకు వెళ్లిపోయారు. ప్రజల్లోకి.. ఇంకా చెప్పాలంటే ప్రతి ఇంట్లోకి చొచ్చుకుపోయారు. ఆమె వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా గుంటూరు నగరంలో చేసిన అభివృద్ధితో పాటు ఆమె వెస్ట్‌కు మారాక వేసిన రోడ్లు, పారిశుధ్య సమస్యలు పరిష్కరించడం ఇవన్నీ బస్తీలు, ఇతర మధ్య తరగతి ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి.
ఇక జగన్‌కు వెస్ట్ సీటులో వైసీపీ జెండా పాతాలన్న కసి ఎప్పటి నుంచో ఉంది. 2014లో, 2019లో పార్టీ అధికారంలోకి వచ్చినా రెండు సార్లు ఇక్కడ ఓడిపోవడం జగన్‌కు అస్సలు నచ్చలేదు. అందుకే గత ఐదేళ్లలో ఇక్కడ గట్టిగానే దృష్టి పెట్టారు. అందుకే రజనీ అయితే కసితో పని చేసి అయినా ఈ సీటు గెలిపించుకుని వస్తుందన్న నమ్మకంతోనే ఆమెను ఇక్కడకు పంపారు.
ఇంకా చెప్పాలంటే ఇటీవల ప్రచారంలో జగన్ రజనీని ఉద్దేశించి నిజంగా హీరో అనే పదం మగవాళ్లకు వాడతారు కాని.. అందుకు ఏ మాత్రం తగ్గదు నా చెల్లి అని మరీ ప్రశంసల వర్షం కురిపించి ఆశీర్వదించారు. ఈ ఒక్క మాటే జగన్ రజనీకి ఏ స్థాయిలో ప్రయార్టి ఇస్తారో చెప్పకనే చెప్పేసింది. ఏదేమైనా టీడీపీ కంచుకోటలో జగన్ పంతాన్ని రజనీ నెరవేర్చి వైసీపీ జెండా ఎగరాలన్న కోరిక ఎంత వరకు నెరవేర్చుతుందో ? చూడాలి.