ఏడిటోరియల్: కాంగ్రెస్ ను భారత్ దేశములోనే లేకుండా చేయటం ఎందుకు?

 "విభజించి పాలించు" అనేది ఒక పాలనా విధానం. భారత్ ను వదలి వెళ్ళినా బ్రిటీష్ వారి సాంప్రదాయాన్ని కాంగ్రెస్ నిర్విరామంగా భారత్ లో కొనసాగిస్తూ వచ్చింది. ఈ దుష్ట యూరప్ వరప్రదాయిని 100% అనుసరించి దేశాన్ని అవిచ్చిన్నంగా పాలించిన కాంగ్రెస్ కు ఇప్పటివరకు ఎదురేలేకుండా  పోయింది. దేశం లో ఎంతో కొంత గుర్తించదగినతగా అధికారములో ఉంటూ వచ్చింది. అయితే 2014 నుండి క్రమంగా దాని పతనం ప్రారంభమైంది. ఇప్పుడు అతి కొద్ది ప్రాంతములోనే అవశేష మాత్రంగా మిగిలింది. బహుశ ఇంకొన్ని ఎన్నికల తరవాత ఈ మాత్రంగా  కూడా దాని ఉనికి లేకపోవచ్చు.


అసలు బాజపా ప్రవచించిన కాంగ్రెస్ ముక్త భారత్ మనకెందుకు? అనే దానికి కొన్ని కారణాలను పరిశీలిద్ధాం, బాజపాను ప్రక్కనపెట్టి. 




1.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాషా, యాస, అసమగ్ర అభివృద్ది, నీరు, నిరుద్యోగం, భూమి, ప్రాంత విశేషాలతో దాదాపు నాలుగు దశాబ్ధాలుగా పోరాట చిత్రాన్ని చిత్రించి చివరకు సోనియా పాలనలో ఎన్నికల ప్రయోజనం కోసం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విభజించి రెంటికి చెడ్డ రేవడై తన వినాశనాన్ని కొనితెచ్చుకుంది.    

   

 నరేంద్ర మోది హవాని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక, విభజన రాజకీయాలని  కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది. కర్నాటక లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, తమ రాష్ట్రానికి ఒక జెండా కావాలి  అంటూ పనికిమాలిన చర్చ మొదలుపెట్టింది. త్వరలో జరగ నున్న ఎన్నికల్లో గెలవాలి అంటే బిజెపి ని అడ్డుకోవాలి, అందుకు కర్ణాటక లో హిందీ వ్యతిరేక ప్రచారాన్ని కాంగ్రెస్ వెనకుండి నడిపిస్తోంది. హిందీ రుద్దవద్దు అని చెప్పడం వేరు, అసలు హిందీ అక్షరాలే ఎక్కడా కనపడకూడదు అని ఉద్యమించడం వేరు. ఇప్పుడు ప్రత్యేక జెండా అన్నవాళ్లు, రేపు ప్రత్యేక దేశం కావాలని అడగరని గ్యారటీ ఏమీ లేదు..


 తమిళనాడులో అన్నా-డిఎంకె ప్రభుత్వం తెలుగు మీడియం రద్దు చేసి తెలుగు సబ్జెక్ట్ ను తమ పాఠశాల పాఠ్యాంశాల నుంచి తొలగించటానికి ప్రయత్నించి ప్రాంతాల మద్య విభేదాల కుంపట్లు రగిల్చి విభజన రాజకీయాలకు తావిస్తూ వస్తున్నాయి.


కాంగ్రెస్ నుంచే విడిపోయిన మమతా బెనర్జీ కూడా ఇలాంటి రాజకీయాలే చేస్తోంది. ప్రభుత్వ స్కూళ్ళలో బెంగాలీని తప్పనిసరి చేయడం తో బెంగాల్ లో ఉన్న బెంగాలీ ఏతర ప్రజలకి కోపం వచ్చింది. నాన్ బెంగాలీ పాపులేషన్ ఎక్కువగా ఉన్న గూర్ఖా లాండ్ ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్  మళ్ళీ మొదలయింది. బెంగాల్ లో బెంగాలీ వర్సెస్ నాన్ బెంగాలి డివిజన్ వచ్చేసింది. ఇలా చిచ్చుపెట్టే రాజకీయాలు చేస్తోంది.




 


2. మన దేశం చుట్టూ మన ఇరుగూ పొరుగుగా ఉన్న చిన్న దేశాలతో వ్యవహరించాలసిన విధంగా వ్యవహరించకుండా చుట్టూ శత్రుదేశాలను లేదా తటస్థ దేశాలను సృష్టించింది కాంగ్రెస్. మనదేశం చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు మనకి గత పదేళ్ళ లో శత్రువులుగానో, తటస్థ దేశాలగానో మారిపోయాయి. పాకిస్తాన్ గొడవ ఎప్పటి నుంచో ఉన్నా గత పదేళ్ళలో “బంగ్లాదేశ్ , శ్రీలంక, నేపాల్ లాంటి దేశాలు మనకి దూరం కావడానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అవలంబించిన విధానాలే కారణం”. మనతో కలిసి ఎదగడానికి “జపాన్”  ఆసక్తి చూపినా మన్మోహన్ ఆ దిశగా పెద్ద ప్రయత్నం చేయలేదు. మన స్నేహాన్ని ఘాడం గా ఆశించిన మిత్రదేశం ఇజ్రాయిల్ ను దశాబ్ధాలుగా దూరం పెట్టటం దౌర్భాగ్య కాంగ్రెస్ దేశానికి చేసిన ప్రధాన ద్రోహం. అమెరికా తో మాత్రమే మన సంబంధాలు మెరుగుపడ్డాయి, కానీ అమెరికా వాళ్ళు మనల్ని వాడుకునే వాళ్ళే కానీ అవసరమొస్తే ఆదుకునేవాళ్ళు కాదు. మోది ప్రధాని అయ్యాక మన విదేశాంగ విధానం మారింది. శ్రీలంక, ఇజ్రాయెల్, జపాన్ లాంటి దేశాలతో సంబంధాలు బలపడ్డాయి.





  

3.బోఫోర్స్ నుంచి గత ఐదు ఆరు దశాబ్ధాలుగా ఆయుధ కొనగోళ్ళలో కమీషన్లకు దారి చూపి ఆయుధాలకోసం బడ్జెట్ లో ప్రత్యేకించిన రక్షణరంగ కేటాయింపులను శుభ్రంగా భోంచేసిన కాంగ్రెస్ నాయకత్వాల చరిత్ర మేడి పండు సామెతలాగే మన రక్షణ రంగ పొట్టవిప్పి చూస్తే అంతా అవినీతి బాగోతమే!


 యుపిఏ ప్రభుత్వం ఆయుధాల కొనుగోళ్ళ  విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, సరిహద్దు భద్రతపై దృష్టి పెట్టలేదు. ఏకే ఆంటోని రక్షణ మంత్రి కాకముందు ఆయుధాల కొనుగోళ్లలో బాగా అవినీతి జరిగేదని, ఆయన  రక్షణ మంత్రి అయ్యాక,  ఆయుధాలు కొంటే అవినీతి జరుగుతుందని ఎలాంటి కొనుగోళ్ళు చేయకుండా కాలక్షేపం చేసారు. ఆయన   నిజాయితీ పరుడే.


 మనోహర్ పారికర్ రక్షణమంత్రి అయ్యాకే ఆయుధాల కొనుగోళ్ళు ఊపందుకున్నాయి. పారికర్ ఇప్పుడు గోవా ముఖ్యమంత్రిగా వెళ్ళినా, ఆయన వేసిన పునాదుల వల్ల ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది.




4. భారత్ జన సంపదను జనాన్ని తమ స్వప్రయోజన ఎన్నికల గెలుపు అధికారం కోసం మాత్రమే వాడుకుంది కాంగ్రెస్ అదిపత్య యూపిఏ. ఫలితంగా తలకు మించిన రిజర్వేషన్లు, ప్రజలను సోమరులుగా మార్చే సంక్షేమ పథకాలు, మత్తులో నింపే మద్యపానం, ఆరొగ్యాన్ని కబళించే ధూమపానం, నిరవధిక ఖనిజ సంపద దోపిడీ, స్పెక్ట్రం స్కాములు, ఆర్ధిక జిల్లాల ఏర్పాట్ల ద్వారా ఆర్ధిక, భూ దోపిడిని ప్రోత్సహించి తాను బలిసి భారత్ ను నిర్వీర్యం చేసింది.


యుపిఏ పదేళ్ళ పాలనలో అసలు అభివృద్ధి జరగలేదని చెప్పలేం కానీ అప్పుడు జరగాల్సిన అభివృద్ధిలో నాలుగో వంతు మాత్రమే జరిగింది. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయం అభివృద్ధికి అనుకూలమైన సమయం. అప్పుడు భారీ అవినీతి, నిర్ణయాల్లో వేగం లేకపోవడం, ఓట్ల కోసం జనాకర్షక పథకాలు తేవడం, భూసేకరణ కు సంబంధించి ఒక పనికి మాలిన చట్టం తేవడం కారణంగా ఆర్ధిక అభివృద్ధి సరిగ్గా జరగలేదు. యుపిఏ పాలనలో సర్వం అవినీతిమయం  "అప్పుడు అవినీతి అందుగలదు, ఇందు లేదని సందేహం వలదన్న రీతిలో"  చెలరేగిపోయింది. దేశ సారాన్ని అవినీతి పీల్చి పిప్పిచేసింది.


ఈ పదేళ్ళలో చైనా తిరుగులేని ఆర్ధికశక్తిగా ఎదిగితే, మనం మాత్రం వెనకబడి పోయాం. ఈ నాలుగు రకాలుగా దేశానికి తీరని నష్టం చేసిన కాంగ్రెస్ ని, కమ్యూనిస్ట్ లని మనదేశం నుంచి రాజకీయంగా సమూలంగా తుడిచి వేస్తేనే కానీ, మనదేశం బాగుపడదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: