భారత్ చైనా సరిహద్ధుల్లో -ఢీ అంటే ఢీ- అంటూ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

భారత చైనా సరిహద్దంతా యుద్ధవాతావరణం నెలకొని ఉందని ఇటు భారత్ రక్షణ శాఖ నుండి అటు చైనా అధికార మీడియా నుండి తామరతంపరగా వార్తలు వినిపిస్తున్నాయి. చివరకు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే భారత రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీ సైతం పార్లమెంట్ వేదికగా సైన్యానికి అవసరమైతే యుద్ధానికి సర్వదా, సమర్ధతతో, సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. వీటిని క్రోడీకరించి చూస్తే  చైనా  "ఢీ అంటే ఢీ"  అంటూ యుద్ధానికి కౌంట్ డౌన్ లెట్టిందని తెలుస్తుంది. ఈ నేపధ్యములో భారత్ సైతం యుద్ధానికి సిద్దపడుతుంది. కొందరు అంతర్జాతీయ నిపుణులు మాత్రం యుద్ధానికి అవకాశమే లేదని అంటున్నారు ఇప్పటికీ కూడా.  



   
 
ఒక పక్క శాంతి సమన్వయం తో ముందు కెళ్లాలంటూనే చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యకు దిగింది. ముఖ్యంగా ఆ దేశ మీడియా గొడవను మరింత పెద్దది చేసేలా కథనాన్ని వెలువ రించింది. ఇక భారతదేశంతో యుద్ధానికి కౌంట్‌ డౌన్‌ మొదల య్యిందని (కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ టు మిలిటరీ యాక్షన్‌) అంటూ చైనా అధికార పత్రిక కథనం పేర్కొంది. చైనాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు  కూడా ఈ వ్యాఖ్యలు బలపరిచేలా మాట్లాడారు.



Chinese Foreign Ministry releases pictures of evidence showing trespass of Indian Border Troops at the Sikkim section



ఢిల్లీ చేస్తున్న చర్యలు తమ సైన్యం ఉత్తరాఖండ్‌, కశ్మీర్‌లోకి అడుగుపెట్టేలా చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. డోక్లామ్‌ సమస్యకు శాంతి చర్చలతో పరిష్కారం అవుతుందన్న ఆశలు సన్నగిల్లాయని పేర్కొన్నారు. మరోపక్క, సమరానికి సమయం దగ్గరపడిందని, శాంతి ద్వారాలు మూసుకుపోయాయని, జరగబోయే పరిణామాలకు భారత్‌ పూర్తిబాధ్యత వహించాలంటూ చైనాకు చెందిన ఓ అధికార పత్రిక కథనం రాసింది.





అయితే, చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి పార్లమెంటు వేదికగా భారత భద్రతా దళాల్లో మరింత ఆత్మ స్థైర్యం నూరిపోశారు. క్విట్ ఇండియా 75 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జరిగిన ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. దేశ భద్రత కోసం ఎలాంటి సవాళ్లయినా ఎదుర్కునేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉందన్నారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధం నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నామన్నారు. కశ్మీర్‌ అంశంపైనా కుండ బద్దలు కొట్టారు. "1948 నుంచి పాకిస్తాన్ ఆక్రమించిన జమ్మూ కశ్మీర్ ప్రాంతాలను తిరిగి సొంతం చేసుకోవడం భారత ప్రజల ప్రగాఢమైన కోరిక" అని ప్రకటించారు. గత కొన్ని దశాబ్దాలుగా భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంద న్నారు. అయితే "ప్రతి సవాలుకూ దేశం అంతకంత బలపడుతూ వచ్చిందని చెప్పేందుకు గర్విస్తున్నాం" అని అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 




 
1962తో పోల్చితే, భారత భద్రతా దళాలు 1965, 1971 యుద్ధాల్లో మరింత ఆరితేరిందని దేశం యావత్తూ బద్రతా విషయం లో బలం పుంజుకున్నదన్నారు. "ఇప్పటికీ అనేక సవాళ్లు ఎదురుగా ఉన్నాయన్న విషయం ఒప్పుకుంటున్నానని అంటూ కొందరు మన దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని లక్ష్యం చేసుకున్నారు అని ఘట్టిగా చెప్పారు. అయితే, దేశ సరిహద్దు భద్రతను కాపాడేందుకు మన సైనికులు సర్వదా సమర్దతగా సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నానని, తూర్పు సరిహద్దు నుంచి వచ్చినా, పశ్చిమ సరిహద్దు నుంచి వచ్చినా సమర్ధవంతంగా తిప్పికొట్టగలమన్న పూర్తి విశ్వాసం ఉంది" అని రక్షణ మంత్రి తన భావం వ్యక్తం చేశారు.




దీని సందర్బం గా సైనిక ఆధునీకీకరణ కోసం బడ్జెట్‌కు అదనంగా మరో రూ.20 వేల కోట్లు అత్యవసరంగా అందించాలని రక్షణశాఖ కేంద్రాన్ని కోరింది. డోక్లాం సెక్టార్లో దాడికోసం సిద్ధం గా ఉన్న చైనా ఎప్పుడైనా భారత్ పై విరుచుకు పడొచ్చన్న వార్తల కారణంగా అదనపు నిధుల కోసం విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యతను సంత రించుకుంది. 2017-2018 బడ్జెట్లో సైన్యానికి కేటాయించిన రూ.2.74 లక్షల కోట్లకు అదనంగా, మరో రూ.20 వేల కోట్లు నిధులు అత్యవసరంగా అదనంగా విడుదల చేయా లంటూ రక్షణశాఖ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రా నేతృత్వంలోని అధికారుల బృందం ఆర్ధికశాఖతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.




ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రక్షణ శాఖకు కేటాయించిన నిధుల్లో 50 శాతం, రాబడి ఖర్చుల్లో 41 శాతం ఇప్పటికే వినియోగించాము అని , అదనంగా ఆయుధ దిగుమతిపై నూతనంగా విధించిన పన్నుతో రక్షణ బడ్జెట్‌లో చాలాభాగం ఆవిరై పోయిందని అన్నారు. సాధ్యమైనంత త్వరగా రక్షణ శాఖ ప్రతిపాదనపై నిర్ణయానికి వస్తామని ఆర్ధికశాఖ తెలిపింది" అని అధికార వర్గాలు సమాచారం.




 మూడుదేశాలు అంటే, సిక్కిం, భూటాన్, టిబెట్ ల కూడలి "ట్రై జంక్షన్" (చికెన్-నెక్) వద్ద రోడ్డు నిర్మిస్తున్న చైనా దళాలను భారత్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా ఇరుసైన్యాలు ఎదురు-ఏదురు గా నిలబడి ఉన్నాయి. చైనా దళాలను ఉపసంహరించుకోవాలని భారత్ - భారత దళాలను వెనక్కి తీసుకోవాలని చైనా డిమాండ్ చేస్తున్నాయి. యుద్ధానికి సైతం సిద్ధమనేలా వాతావరణం నెలకొనడంతో భారత సైన్యం పూర్తిస్థాయిలో సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: