తెలంగాణాలో టమాటా బాంబ్


ఒక్కసారిగా తెలంగాణాలో టమాటా తదితర కురగాయల ధరలు నింగినంటుతున్నాయి. సాధారణంగా రూ.20/- నుంచి రూ.30/- మద్య ఊగిసలాడే ధర ఒక్కసారే బాంబ్ లా పేలింది. రసం చేసుకోవాలన్నా మరేరకమైన కూరలోకైనా టమాట అత్యవసరం. కొందరి వంటగదుల్లో టమాటలేని కూరే ఉండదు. అలాంటి నిత్యావసరకూరగాయ టమాటా ధర కొండపై కూర్చుంది. అలాగే పచ్చి మిరపకాయల ధర నింగినే దాటింది. ఈ రెండూ లేకుండా వంటగది ఓపెన్ అవటం జరగదు.  




మహబూబ్‌నగర్‌ జిల్లాలో మిడ్జిల్‌ మండల కేంద్రంలో టమాట రేటు అమాంతం పెరిగింది. మిడ్జిల్‌ మండల కేంద్రంలో గురువారం జరిగిన సంతలో కిలో టమాట వంద రూపాయలకు విక్రయించారు. గత వారం 20/- రూపాయలకు కిలో ఉన్న టమాట ఒకేసారి వంద రూపాయలకు చేరుకుంది. పచ్చి మిర్చి 80 నుంచి 130 రూపాయలకు చేరడంతో జనం బెంబేలెత్తి పోతున్నారు.


మిగిలిన అన్నీ కూరగాయల ధరలు 30 నుండి 60 శాతం పెరిగినట్లు తెలుస్తుంది. ఇక ఆకుకూరల ధరలు చెప్పనలవికావటం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: