రాయలసీమ: బాలయ్యకు ముచ్చెమటలు పట్టిస్తున్న పరిపూర్ణ..అదే టార్గెట్..!

Divya
రాయలసీమలోని అనంతపురం జిల్లా హిందూపురం నియోజవర్గం అంటే  టిడిపి కంచుకోట అని చెప్పవచ్చు.. సీనియర్ ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గ ఎన్టీఆర్ తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణ సైతం ఇక్కడ నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.. మళ్లీ ఆ తర్వాత నందమూరి కుమారుడు బాలకృష్ణ  2014, 19లో ఎమ్మెల్యేగా నిలబడి గెలుపొందారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని ఉద్దేశంతో బాలయ్య విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి బాలయ్యకు రెబల్స్ ట్రబుల్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.

బాలకృష్ణకు దీటుగా శ్రీపీఠం పీటాధిపతి పరిపూర్ణానంద  వణుకు పుట్టించేలా చేస్తున్నారు. హిందూపురం అసెంబ్లీతో పాటు లోక్ సభ సీటు నుంచి కూడా ఈయన గతంలో పోటీ చేస్తానని వెల్లడించారు.. అన్నట్టుగానే ఇండిపెండెంట్గా నిలబడ్డారు పరిపూర్ణానంద స్వామి..ముఖ్యంగా హిందువుల ఓట్లను కచ్చితంగా ఈయన చీల్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిజెపిలో పొత్తులో భాగంగా మైనార్టీ ఓట్లు వైసిపికి కచ్చితంగా ప్లస్గా మారుతుందని చెప్పవచ్చు.. ఇప్పుడు మళ్లీ పరిపూర్ణానంద విషయంలో  బాలయ్య కాస్త ఆందోళన కలిగిందని అక్కడి నేతల సైతం తెలియజేస్తున్నారు. నిజానికి హిందూపురం సీటు పొత్తుల భాగంగా పరిపూర్ణానంద స్వామి కి బిజెపి నుంచి దక్కుతుందని అనుకున్నారు.

కానీ ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి విఫలంగానే మిగిలాయి. తీర ఆ సీటు టిడిపి సీటింగ్ ఎమ్మెల్యే బాలయ్య కావడం చేత పరిపూర్ణానందకు నిరాశ మిగిలింది.. ఆ తర్వాత వెనక్కి తగ్గని ఈయన ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు.దీంతో ఒక్కసారిగా అక్కడి నేతలు ఉలిక్కిపడ్డారు.. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అటు బాలయ్యకు కూడా నిద్ర లేకుండా అయిపోతుందని సమాచారం. అయితే ఈసారి అత్యధికంగా భారీ మెజార్టీతో గెలవాలనుకుంటున్న బాలయ్య తన కలలకి పరిపూర్ణానంద స్వామి గండి కొట్టేలా కనిపిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో హిందూపురం నియోజకవర్గం లో బాలయ్యకు గట్టి పోటీ కూడా రెబల్స్ మధ్య ఉండబోతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: