రింకు సింగ్ ని ఎంపిక చేయకపోవడంపై.. రాయుడు షాకింగ్ కామెంట్స్?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులందరిలో ఎన్నో రోజుల నుంచి ఉన్న ఉత్కంఠకు ఇటీవల తెరబడింది అన్న విషయం తెలిసిందే. జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ జట్టులో ఎవరు చోటు సంపాదించుకుంటారు అనే విషయంపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. అయితే ఇటీవల బీసీసీఐ అటు వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది సభ్యుల వివరాలను ప్రకటించడంతో ఈ ఉత్కంఠకు తెరపడింది అని చెప్పాలి. అయితే కొంతమంది ఆటగాళ్లకు తప్పకుండా t20 వరల్డ్ కప్ జట్టులో చోటు తక్కుతుందని ఎంతోమంది భారత క్రికెట్ ఫ్యాన్స్ ఊహించినప్పటికీ ఇక పలువురు ఆటగాళ్ల విషయంలో మాత్రం అటు సెలెక్టర్లు కాస్త మొండిగానే వ్యవహరించారు. అద్భుతమైన ఆట తీరును కనబరుస్తున్నా.. జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదు.

 ఇలా జట్టు ఎంపికలో భంగపాటుకు గురైన ఆటగాళ్లలో అటు రింకు సింగ్ కూడా ఒకరు. గత ఏడాది ఐపీఎల్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఒక్కసారిగా సూపర్ స్టార్ గా మారిన రింగు సింగ్ ఇక తర్వాత టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే భారత జట్టు తరఫున కూడా అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ ఆకట్టుకున్నారు. ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్లు కూడా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ఆడుతూ మెరుపు బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. దీంతో అతనికి టి20 వరల్డ్ కప్ లో తప్పకుండా చోటు తక్కుతుందని అందరు ఊహించారు.

 కానీ ఊహించని రీతిలో సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ప్లేయర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రింకు సింగ్ ను బలి పశువును చేశారంటూ ఇప్పటికే మాజీ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సెలెక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై అంబటి రాయుడు కూడా స్పందించాడు. టి20 వరల్డ్ కప్ జట్టులో రింకు లేకపోవడం పెద్ద లోటు అంటూ అభిప్రాయపడ్డాడు. అతడిని తప్పించడం చూస్తుంటే క్రికెటింగ్ సెన్స్ కంటే గణాంకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థమవుతుంది. ఇప్పుడు ఎంపికైన ప్లేయర్లలో జడేజా మినహా ఏ ఆటగాడు గత రెండేళ్లలో చివరి ఓవర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించారు అంటూ ప్రశ్నించాడు రాయుడు. క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటూ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: