ఆ ఎంపీకి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పల్నాడు..?

Suma Kallamadi
వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తుండేవారు. అయితే ఆయనను ఈసారి పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ స్థానం నిలబెట్టింది. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ ఒక చిన్నపాటి రౌడీ అని ప్రత్యర్ధులు పిలుస్తుంటారు. ఆ దూకుడు స్వభావం ఉంది కాబట్టే పల్నాడులో ఫ్యాక్షనిజానికి ఆయన మంచి బదిలీ ఇస్తారని ఇక్కడ దించారు కానీ అనిల్ కుమార్ యాదవ్ పప్పులు ఉడకలేదు. నిజానికి రౌడీయిజం అంటే హడావుడి చేస్తూ భయపెట్టడం, ఫ్యాక్షనిజం అంటే ప్రాణాలను తీసేయడం. ఇది అలవాటు లేని అనిల్ కుమార్‌కు టీడీపీ నేతలు చుక్కలు చూపించారు.
పోలింగ్ సమయంలో ఈ జిల్లాలో ఊహించని విధంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, మాచర్లల్లో వైసీపీ అభ్యర్థులపై టీడీపీ నేతలు రాళ్లు కర్రలు రాడ్లతో దాడులకు తెగబడ్డారు. కార్లను తుక్కుతుక్కుగా ధ్వంసం చేశారు. పక్క ప్లాన్ ప్రకారమే పల్నాడులో ఈ అరాచకాలకు జరిగాయని వైసీపీ నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థి అనిల్ కుమార్‌ యాదవ్‌ షాకింగ్ అలివేషన్స్ చేశారు. మాచర్లలో టీడీపీ నేతలు భారీ దాడులే చేశారని. పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, అతని తనయుడు పై టీడీపీ వాళ్లు భయంకరమైన దాడులకు పాల్పడ్డారు.
నరసరావుపేటలో అనిల్ ఏ మాత్రం కంట్రోల్ కుండ పోవడానికి పోలీసులు టీడీపీ వారికి కొమ్ము కాయడమే వారికి సపోర్ట్ గా నిలవడమే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపిస్తున్నారు. పోలీసులు రివర్స్ కావడం వల్ల అలానే టిడిపి వాళ్ళు గ్రౌండ్ లెవెల్ లో అరాచకాలకు ఊహించిన విధంగా పాల్పడడం వల్ల అనిల్ కుమార్ యాదవ్ చూస్తూ ఉండిపోయారు తప్ప మరిన్ని ఏమి చేయలేకపోయారు. రీసెంట్గా దీనిపై ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి పోలీసులు పూర్తిగా ఫెయిల్ అయ్యారని అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ వారిపై ఫిర్యాదు చేయడానికి ఫోన్ చేస్తే ఎస్పీలు, డీఎస్పీలు ఎవరూ కూడా కాల్ చెయ్ లిఫ్ట్ చేయడం లేదని ఆయన ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: