జీఎస్టీ ఎఫెక్ట్..! భారీ డిస్కౌంట్ సేల్..!

Edari Rama Krishna
ఇప్పుడు భారత దేశంలో ఎక్కడ చూసినా జీఎస్టీ పైనే చర్చలు జరుగుతున్నాయి.  భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు తీసుకున్న తర్వాతో ఎన్నో వినూత్న పథకాలు తీసుకు వచ్చారు.  అంతే కాదు పెద్ద నోట్ల చెలామణి రద్దు చేసి 500, 1000 నోట్ల స్థానంలో కొత్త 500, 2000 నోట్లు తీసకు వచ్చి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పుడు భారత దేశ పురోభివృద్ది కోసం జీఎస్టీ బిల్ తీసుకు వస్తున్నారు.  దీంతో ఇప్పుడు అన్ని వ్యాపార రంగాల్లో పెను మార్పులు వస్తున్నాయి.  

జులై ఒకటి నుంచి జీఎస్టీ అమలుకానుంది దీంతో చాలా మంది వ్యాపారులు తమ వద్ద ఉన్న స్టాక్ త్వరగా అమ్మేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా  బట్టలు, చెప్పులు, బూట్లు, ఇతర వస్తువులు డిస్కౌంట్ల మీద అమ్మేందుకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ ఫ్యూమా 40శాతం డిస్కౌంట్, ఎక్స్‌ట్రా 10శాతం ఆఫర్ చేస్తుండగా పీప్ జీన్స్ మూడు కొంటే మూడు ఫ్రీ అంటూ ఊరిస్తోంది.  సాధారణంగా సీజనల్ గా ఇలాంటి ఆఫర్లు పెడుతుంటారు..కానీ ఈ నెల మాత్రం జీఎస్టీ దెబ్బకు భారీ ఆఫర్లు పెడుతున్నారు.  

ఈ పన్ను భారం పడకముందే అనేకమంది వ్యాపారులు జాగ్రత్త పడుతున్నారు. సుమారు నెల ముందు నుంచే తమ సీజన్ సేల్ వస్తువుల ధరలను తగ్గించి అమ్మేస్తున్నారు.ఇప్పటివరకు తాము 30శాతం స్టాక్‌ని మాత్రమే అమ్మినట్టు, ఇంకా 40శాతం పైగా అమ్మకాలు జరపాల్సివుంటుందని అంటున్నారు వ్యాపారులు. జులై ఒకటిలోగా స్టాక్ అంతా అమ్ముడుపోయేలా చూస్తున్నామని బెంగుళూరులోని రిటైల్ గార్మెంటర్లు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: