అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఉద్వాసన తప్పదా?



అత్యున్నత వ్యవస్థకు అధిపతి అయిన ఒక ఉన్నతాధికారిని అధ్యక్షుడు  "మీ నుంచి విధేయతను ఆశిస్తున్నా!" అని కోరి అగ్రరాజ్య అగ్రపీఠాసీనుడైన అమెరికా అధ్యక్షుడు విశ్వజనీనం దృష్టితో మరుగుజ్జులా మారి అగ్రరాజ్య పరువు ప్రతిష్ఠ మంట గలిపిన సందర్భమిది.  


అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌  స్వయంగా "మీ నుంచి విధేయతను ఆశిస్తున్నా!" అని చెప్పి, చివరికి సహేతుక కారణం లేకుండానే "ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కామే" ను పదవి నుంచి తొలగించటం అసాధారణ వివాదమైంది. కామే తనను తొలగించ టమే కాకుండా తప్పు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన చెంది "ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్‌ అయిన తనకు- అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మధ్య జరిగిన సంభాషణలు"  అన్నింటినే కాకుండా, "అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని నిర్ధారిస్తూ" "సెనేట్‌ సెలెక్ట్‌ కమిటీ ఆన్‌ ఇంటలిజెన్స్‌" ముందు వెల్లడించిన విషయాలతో డొనాల్డ్ ట్రంప్‌ విశ్వసనీయతను పూర్తిగా  కోల్పోయారనే చెప్పాలి.  ప్రపంచ తొలి అత్యుత్తమ అగ్ర ప్రజాస్వామ్య రాజ్యాన్ని అత్యంత హేయమైన అనాగరిక పాలనకు మచ్చుతునకగా మార్చిన ఘనత, ఘన చరిత్ర మూటగట్టుకున్నారు ది గ్రేట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.   


అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రతిపక్ష డెమోక్రట్ల నుంచి తలనొప్పి ఎదురు కానుంది. ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించే పనిలో "అభిశంసన ప్రక్రియ" (ఇంపీచ్‌మెంట్‌) కు ఇద్దరు డెమోక్రటిక్‌ సభ్యులు టెక్సాస్‌ రిప్రజెంటేటివ్‌ ఆల్‌ గ్రీన్‌, కాలిఫోర్నియా రిప్రజెంటేటివ్‌ బ్రాడ్‌ షెర్మాన్‌ సన్నాహాలను చేస్తున్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన అతి స్వల్ప కాలానికే ఇంతటి దుస్థితి నెదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు ఆ దేశ చరిత్రలో లేరు.



ఎన్నికలకు స్వల్ప వ్యవధి ముందు వరకు (8%) ప్రజామద్దతు అధికంగా కలిగి ఉన్న డెమోక్రాట్ సభ్యురాలు హిల్లరీ క్లింటన్ ఒక్క సారిగా (-2%) ప్రజామద్దతు కోల్పోవటానికి కారణమైన సందర్భంలో ఈ-మెయిల్ లీకుల వ్యవహారం వెనుక రష్యా కెజిబి అదృశ్యహస్తం ఉందనేది, ప్రజల గుండెల్లో "మనమింత చరిత్ర హీనులమా?" అని తమను తాము ప్రశ్నించుకునే స్థాయికి నైతికత పడిపోయింది.  అమెరికన్లు దీన్ని సహించలేరు.


రిపబ్లికన్లు ట్రంప్ కంపును భరించాలని భావించినా చరిత్ర క్షమించదని వారికి తెలుసు. అందుకే వారికి వారే తమ నాయకుని పై చర్యకు కూడా ఉపక్రమించే అవకాశాలు కూడా  పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు.  అందుకే అనుక్షణం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ట్రంప్.  


అమెరికా చట్టాల ప్రకారం న్యాయప్రక్రియను అధ్యక్షుడు కూడా అడ్డుకోలేరు, కాంగ్రెస్‌ సభ్యుడైనా, సెనేటర్‌ అయినా, అమెరికా అధ్యక్షుడైనా చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఎవరూ చట్టానికి అతీతులు కారు, అని ఆల్‌ గ్రీన్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు న్యాయ ప్రక్రియను అడ్డుకున్నట్లు రుజువు అయితే అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించే అవకాశం ఉందని మరికొందరు డెమోక్రటిక్‌ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.


అమెరికన్ కాంగ్రెస్‌ (పార్లమెంట్) లో రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ ఇరుపక్షాలకూ ఉన్న సంఖ్యా బలాన్ని లెక్కలోకి తీసుకుంటే అధ్యక్షుడిని అభిశంసన ద్వారా తొలగించటం ఏమాత్రం సాధ్యం కాకపోవచ్చు. కారణం "హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌" లో అధికార రిపబ్లికన్‌ పార్టీకే అధిక మెజార్టీ ఉంది. కాకపోతే ఇది నైతికతకు సంబందించిన వ్యవహారం కావటం అమెరికా లాంటి అగ్రరాజ్యం ఎన్నికల్లో ఆగర్భ  శతృదేశమైన రష్యా ప్రభావం ద్వారా "బలాబలాలు తారుమారై ప్రజాభిప్రాయం మంట కలవటం"  అనేది డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సమస్యాత్మక విషయం తలనొప్పి వ్యవహారం అవుతుందనటంలో సందేహం లేదు.



మోనికా లూయిస్కీతో బిల్‌ క్లింటన్‌ సంబంధాలు, పౌలా జాన్సన్‌ను వేధించినట్లు వచ్చిన ఆరోపణల దుమారంతో తన అధ్యక్ష పదవికే ఎసరు తెచ్చుకొని చివరకు రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధులు ‘అభిశంసన ప్రక్రియ’ ప్రతిపాదించారు. అయితే హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ లో బిల్‌క్లింటన్‌ పార్టీ డెమోక్రాట్స్ సభ్యులు ఆయనకు దృధంగా సహకరిస్తూ అభిశంసనకు మద్దతు నివ్వకపోవటం ఆయనకు కలసివచ్చినది. అధ్యక్షుడిని తొలగించటానికి 67 మంది సెనేటర్ల మద్దతు అవసరం అయితే అంతమంది ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. రిపబ్లికన్‌ పార్టీకి తగినంత మెజార్టీ లేకపోవటంతో ఈ ప్రతిపాదన ఆదిలోనే వీగిపోయింది. ఫలితంగా అధ్యక్ష పదవిని కోల్పోయే ముప్పును తప్పించుకున్నారు.


అయినా అందరిని కలుపుకొమి ముందుకుపోగల నేర్పున్న క్లింటన్ పై వ్యక్తిగతంగా ఎవరికీ ద్వేషం లేకపోవటం స్వంత పార్టీ సంపూర్ణంగా సహకరించటం కలసివచ్చిన అంశాలు. ఆ పరిస్థితి డొనాల్డ్ ట్రంప్ కు అసలు లేనే లేదు. ఆయన పార్టీ వాళ్ళే ఆయనను వ్యతిరెకిస్తారు కొన్ని సందర్భాల్లో స్వంత కూతురు కూడా. 


MAY BE IMPEACHMENT BEING CALLED FOR BY SENATORS OF REPUBLICAN PARTY


1970లో అమెరికా వియత్నాం యుద్ధంలో అమెరికా తలమునకలై ఉన్న సమయంలో కుదిపేసిన కుంభకోణం "వాటర్‌గేట్‌" నాటి అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ రిపబ్లికన్‌ తరఫున మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో నిక్సన్‌ ఎన్నికల ప్రచార బృందం కొన్ని చట్టవ్యతిరేక చర్యలకు శ్రీకారం చుట్టిన అంశమే వాటర్‌గేట్‌ కుంభకోణం. బృందం సభ్యులు డెమోక్రటిక్‌ నేషనల్‌ కమిటీకి చెందిన వాటర్‌గేట్‌ కార్యాలయంలోకి చొరబడి పత్రాలను దొంగిలించినట్లు, ఫోన్లను ట్యాప్‌ చేసే పరికరాలను అమర్చినట్లు ఆరోపణలు వచ్చాయి.


విచారణ చేపట్టిన ఎఫ్‌బిఐను నిరోధించాల్సిందిగా సిఐఏకు అధ్యక్షుడు సూచించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. దాంతో అభిశంసన తప్పదని నిర్ధారణ కావటంతో రిచర్డ్‌ నిక్సన్‌ రాజీనామా చేశారు. హేమాహెమీలు రాజకీయ దురందరులైన నిక్సన్ క్లింటన్ లను తొలగించిన పటిష్ట ప్రజాస్వామ్య దేశం అమెరికా. ఆఫ్ట్రాల్ ఏ నైతికతకు చేరువకాలేని డొనాల్డ్ ట్రంప్ కు ఉద్వాసన పలకటం పెద్ద కష్టం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: