సూపర్ విక్టరీ.. అయినా పంజాబ్ చెత్త రికార్డు?
కానీ ఇప్పుడు శిఖర్ ధావన్ అందుబాటులో లేకపోవడంతో సామ్ కరణ్ కెప్టెన్సీ లో వరుసగా మ్యాచ్లు ఆడుతోంది అన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటివరకు 9 మ్యాచులు వాడిన పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించింది. ఇక ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే ఆ జట్టు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడం కష్టంగానే కనిపిస్తుంది అని చెప్పాలి. అయితే ఇటీవనే కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంది పంజాబ్ కింగ్స్ జట్టు. ఏకంగా కొండంత లక్ష్యాన్ని సైతం అలవోకగా చేదించి అద్భుతమైన విజయాన్ని సాధించింది అని చెప్పాలి.
ఇలా కోల్కత్తా తో జరిగిన మ్యాచ్లో ఏకంగా ఎనిమిది టికెట్లు తేడాతో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించినప్పటికీ అటు ఒక చెత్త రికార్డు మాత్రం ఆ జట్టు ఖాతాలో చేరిపోయింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక సార్లు 200కు పైగా పరుగులు సమర్పించుకున్న జట్టుగా పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ 28 సార్లు ప్రత్యర్థులకు రెండు వందలకు పైగా పరుగులు సమర్పించుకుంది. తర్వాత స్థానంలో ఆర్సిబి 27, ఢిల్లీ క్యాపిటల్స్ 21 ఉన్నాయి ఇలా పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి విజయం సాధించినప్పటికీ ఇక చెత్త రికార్డు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది.