ఆ క్రేజీ కాంబినేషన్ మూవీ నా డ్రీమ్.. రజిని డైరెక్టర్ కామెంట్స్ వైరల్?

praveen
సాధారణంగా  హీరోల అభిమానులకు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తే చూడాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ మల్టీస్టారర్ మూవీస్ కి సంబంధించిన వార్తలు ఎన్నో తెరమీదకి వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటివికొన్ని కేవలం పుకార్లు గానే మిగిలిపోతే ఇంకొన్ని మాత్రం ఇక సినిమాలు గా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే హీరోల అభిమానులు ఎలా అయితే ఇలా క్రేజీ కాంబినేషన్ కోరుకుంటూ ఉంటారో.. అటు కొంతమంది డైరెక్టర్లు కూడా తమ కెరియర్ మొత్తంలో ఒక్కసారైనా రిపీట్ చేయాలనుకునే కాంబినేషన్ ఒకటి ఉంటుంది.

 ఇక అలాంటి కాంబినేషన్ రిపీట్ చేసే సమయం వచ్చినప్పుడు ఏకంగా తమ కెరియర్ కాలంలో మన అనుభవాన్ని మొత్తం పెట్టుబడిగా పెట్టి సినిమాలను తీయడం చూస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే  అయితే ఇటీవల రజనీకాంత్ డైరెక్టర్ కూడా తన కెరియర్ లో ఇలాంటి ఒక అరుదైన కాంబినేషన్ తో సినిమా చేయాలని కోరిక ఉంది అంటూ ఇటీవలే చెప్పుకొచ్చాడు  ఆయన ఎవరో కాదు నెల్సన్ దిలీప్ కుమార్. ఈయన గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు  రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాను తెరకేక్కించి.. ఇక బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈయన.. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రజినీకి సాలిడ్ ఇచ్చి ఇక సూపర్ స్టార్ అభిమానులందరికీ ఫేవరెట్ డైరెక్టర్గా మారిపోయారు.

 ఇక ప్రస్తుతం రజనీకాంత్ తో జైలర్ సినిమాకు సీక్వల్ గా హుకుం అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న నెల్సన్ దిలీప్ కుమార్ తనకు ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమా చేయాలని ఉంది అంటూ మనసులో మాట బయటపెట్టాడు. నేను దళపతి విజయ్ సినిమాకు డైరెక్షన్ చేయాలని ఉంది. ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే ఆ సినిమాలో మహేష్ బాబు, మమ్ముట్టి, షారుక్ ఖాన్ లకు కీలకపాత్రలు ఇస్తాను  వాళ్ళందరి కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలనేది నా డ్రీమ్ అంటూ నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: