నాయకుల నోటి దూల తో సంచలనం




ఆ పార్టీ ఈ పార్టీ అనేదేమీ లేదు. అందరూ అందరే. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలతో పాటు కేంద్రములో అధికారం వెలగబెట్టే భారతీయ జనతా పార్టీ నాయకులకు విజ్ఞత కోల్పోతున్నారు. భాధ్యత మరచిపోతున్నారు. నోటి దూలపెంచుకుంటు న్నారు. వారికి అదికార మదం అరికాలు నుండి నసాళానికి ఎక్కినట్లుందని పిస్తుందని ఋజువులు దొరుకుతున్నాయని అనేకులు అంటున్నారు. ఇప్పటి సందర్భమేమంటే:   






రాజస్థాన్‌ రాష్ట్ర మంత్రి, అదీ ఉన్నత విద్యాశాఖను నిర్వహించే మంత్రివర్యులు, కాళిచరణ్‌ సరాఫ్‌ నోటి దూలతో లేకపోతే అజ్ఞానంతో అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నారు. అత్యాచారాలను అరికట్టలేమంటూ ఆయన చేసిన మూర్ఖపు వ్యాఖ్యలు ఆ రాష్ట్రం లోనే కాదు దేశంతా కలకలం రేపాయి. ఒక మైనర్‌ బాలికపై ఒక వ్యక్తి ధారుణ అత్యాచారానికి పాల్పడిన సన్ఘటనపై స్పందిస్తూ బీజేపీ నాయకుడు అయిన ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.



"నగల వ్యాపారి నగల దుకాణం యాజమాని ఇంట్లో పనిచేసే వ్యక్తి - ఆ యజమాని కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు లేదా ప్రభుత్వం ఏం చేయ గలుగుతుందని" అన్నారు. ఇలాంటి కేసులు నమోదైనప్పుడు నిందితుడిపై కఠినచర్య తీసుకోవడం, బాధితురాలికి మంచి వైద్యసహాయం అందించడం మినహా తామేమి చేయలేమని చెప్పు కొచ్చారు.




రాజస్థాన్‌లో రేప్‌ కేసులు పెరిగిపోతుండడం గురించి ప్రశ్నించగా మంత్రి విచణక్ష కోల్పోయారు. "రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాళం వేయాలని మీరు భావిస్తున్నారా? ప్రతి గడప దగ్గర పోలీసు లను కాపలా పెట్టాలా? రోజు రోజుకు నేరాలు పెరుగు తున్నాయి అనేదానికి మేమేం మాత్రం ఏమి చేయగలమని" ప్రతిస్పందించారు. మంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు, ప్రజాసంఘా లు తమ నిరసన తెలిపాయి. ఆ బాజపా నాయకుని భావ దారిద్యానికి మండిపడ్డాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: