ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదు.. ఓడిన వారిలో చిగురిస్తున్న ఆశలు..!!

Shyam Rao

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం నియోజకవర్గాల పునర్విభజన. ఇది కాస్త అమలు అయితే గనుక కిందటి సారి ఓడిపోయిన వారికి ఈ సారి కొత్త నియోజక వర్గంలో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక. ఈ సారి తెలుగు రాష్ట్రాల పార్టీల నుంచి ఎమ్మెల్యే  అవ్వాలని ఆశపడేవారి సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఈ సారి వచ్చే అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని ఎమ్మెల్యే కావాలని ఆశపడుతున్న ఆయా పార్టీల అభ్యర్థులు ముందే తమ పైరవీలను షురూ చేస్తున్నట్లు సమాచారం.



ముందే పార్టీ నుండి హామీ పొంది ఉంటే.. నియోజక వర్గాల పెంపు అనంతరం వెంటనే బరిలోకి దిగొచ్చని ప్లాన్ చేస్తునట్లు తెలుస్తోంది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్26 ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను 175 నుంచి 225కు పెంచుకోవచ్చు. అదే విధంగా తెలంగాణలోని స్థానాలను 119 నుంచి153కు పెంచుకోవచ్చు. అయితే ఈ అంశం కేంద్రం పై ముడిపడి ఉన్నందున ఈ విషయం పై కేంద్రం సమాలోచనలు ప్రారంభించింది. కానీ రాజ్యాంగం లోని ఒకే అంశం ఈ విభజనకు అడ్డు పడే అవకాశం ఉందని రాజ్యంగా నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.



అయితే, ఆర్టికల్ 17(3) ప్రకారం 2026 తర్వాత ప్రచురించే తొలి జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంటుంది. అప్పటి వరకు పునర్విభజన చేయడానికి వీల్లేదు. ఇప్పుడిదే నియోజకవర్గాల పెంపుకు అడ్డంకిగా మారింది. సెక్షన్ 26ను రాసినప్పుడే... ఆర్టికల్ 170తో సంబంధం లేకుండా అని రాసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. అయితే, రాజ్యాంగాన్ని సవరించైనా సరే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాలను పెంచుతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: