జయలలిత కోడెనాగు పగ-కమల్ హసన్ కు బాగాతెలుసు



తమిళ సాధారణ ప్రజలకు అమ్మగా కనిపించిన జయలలిత పగపడితే మాత్రం కోడెనాగుకు తీసిపోదు. తనకు నచ్చనివారిపై ఆమె ముప్పేట దాడి చేసైనా తన పగతీర్చు కుంటారని ప్రతీతి. శాసనసభలో తన చీర గుంజారనే విషయాన్ని  మరింతగా మాగ్నిఫై చేసి కరుణానిధి తో, డిఎంకె తో చెలగాటమాడి చెరసాల్లోకి తోసేసే వరకు ఆమె నిద్ర పోలేదు. 


విశ్వరూపం సినిమా శాటిలైట్ హక్కులను అన్నాడీఎంకేకు చెందిన ఒక ఛానల్‌కు ఇచ్చేందుకు కమల్ నిరాకరించిన దరిమిలా, సినిమాను నిషేధిస్తూ జయ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో విశ్వరూపం వ్యవహారం పూర్తిగా రాజకీయం రంగు పులుముకుంది. కమల్ ఈ సినిమా విడుదల కోసం మద్రాసు కోర్టును ఆశ్రయించడం తో ఊరట అయితే లభించింది. అప్పటికే జయకు కమల్ మీద పీకలదాకా కోపం తో ఉండింది.  అందుకే జయ ప్రభుత్వం దాన్ని తమిళనాడు హైకోర్టులో సవాల్ చేశారు. ఆ వివాదం కొన్ని రోజులకు సద్దుమణిగింది.




విశ్వరూపం సినిమా విడుదలలో జయ ప్రభుత్వం వలన కమల్ అనుభవించిన వెదన వర్ణనాతీతం. జయలలిత మరణించిన తర్వాత కూడా ఈ ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ ఆమెపై విమర్శలు ఆపడంలేదు. ట్వీట్లమీద ట్వీట్లతో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. జయ అంటే కమల్‌కు అంత కసి, కోపం  ఎందుకు? విశ్వరూపం సినిమా విడుదల సమయంలో ఆమె ప్రభుత్వం కమల్ పై చూపిన కక్ష, కార్పణ్యాలను ఇంకా మరచిపోలేకపోతున్నారా?  తమిళ నాట  రాజకీయం ఓ కొలిక్కి వచ్చినా వివాదస్పద ట్వీట్లకు ఆయన ముగింపు పలకలేదు.


జయ మరణం, సుప్రీం తీర్పు, సీఎం ఎన్నిక నేపథ్యంలో సంచలన ట్వీట్లు చేసిన ఆయన తాజాగా మరోసారి తన ట్వీట్ల కి పని చెప్పారు. విశ్వాస పరీక్షలో పళనిస్వామి గెలిచినప్పటికీ ఫలితాన్ని తాను అంగీకరించబోనని అన్నారు. దోషిగా తేలిన శశికళ, ఆమె కుటుంబ సభ్యులంతా పళనిస్వామిని సీఎంగా నిలబెట్టారని, ఆదో నేరస్తుల కూటమిగా అభివర్ణిస్తూ ఘాటుగా ట్వీట్లతో స్పందించారు.




అంతటితో ఆగకుండా దివంగత సీఎం జయ పై కూడా సుప్రీం న్యాయస్థానం నేరారోపణను నిర్ధారించినదన్నారు. దాన్ని కావాలని గుర్తు చేస్తూ కమల్ ప్రత్యేకించి వ్యాఖ్యానించారు. విశ్వరూపం వివాదం నాటి పరిస్థితులను కమల్ ఇంకా మరిచి పోనట్లుందని పిస్తుంది. ఆనాడు తన ప్రభుత్వం విశ్వరూపంతో కమల్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. కమల్ నటించి, దర్శకత్వం వహించిన విశ్వరూపం సినిమాను విడుదల రోజే టీవీల్లో ప్రసారం చేస్తారనే వార్తలు వచ్చాయి. ఎందుకంటే రూ. 50 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా డీటీహెచ్ హక్కులను ముందస్తుగానే అమ్మేశారు. దానివల్ల థియేటర్‌లో ఎవరూ సినిమా చూడరని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందారు. కమల్ అగ్రిమెంట్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాటి సీఎం జయ కు ఎగ్జిబిటర్లు పిర్యాదు చేశారు.



పళని విశ్వాస పరీక్షలో నెగ్గిన తర్వాత కూడా కమల్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అసెంబ్లీని శుద్ధి చేయండి, ఎన్నికలు జరిపించండి, ప్రజలే ప్రభుత్వాన్ని నిర్ణయిస్తారు. కోపిష్టినైనా తాను రాజకీయాలకు పనికిరానని" ఆయన అన్నారు. బాలన్సుడుగా వ్యవహరించే రాజకీయ నాయకులంటే ప్రజలకు ఇష్టమని, అయితే తనున్నట్లే ప్రజలు కూడా ఇప్పుడు కోపంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కమల్ కామెంట్లపై శశికళ వర్గం మండిపడుతోంది.



Viswaroopam first look

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: