జయలలిత చచ్చి బ్రతికిపోయింది లేకుంటే శశికళతోనే జైల్లో చచ్చేది?

జయలలిత ప్రజలకు సంక్షేమ ఫలాలు అంతు లేకుండా అందించినా, ఆమె తమిళ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఆ తమిళ ప్రజల ప్రేమకు హస్థిమశాంతకం. జయలలితకు వారసులున్నారో లేరో అప్రస్తుతం. కాని ఈ పాపం మొత్తం శశికళ వల్లనే ఆమె ప్రోద్భలంతో జరిగినా జయలలిత కు తెలియదనటం మహాపరాధం. ప్రజలు ప్రేమతో అమ్మ అని పిలుస్తూ పురచ్చితలైవిగా గౌరవిస్తూ ఆమెనే దేవతగా పూజిస్తూ కనబరచిన ప్రేమా వాత్సల్యానికి ఆమె వారికి శశికళ నేతృత్వం లో కొండచిలువలా ఎదిగిన మన్నార్ గుడి మాఫియా చేతుల్లో తమిళనాడు భవిష్యత్తును పెట్టి బహుశ ప్రజల అనుమానం ప్రకారం తానే హతమై ఉండ వచ్చు. 




న్యాయమూర్తులు జస్టిస్‌ పినాకి చంద్రఘోష్, జస్టిస్‌ అమితావ రాయ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం, జయలలిత ఆదాయాని కి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ 1996, జూన్ 14 వ తేదీన సుబ్రమణ్యస్వామి మద్రాసు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ / స్పెషల్‌ జడ్జి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఆదేశాలతో  కేసు కర్ణాటకకు బదిలీ జరిగి  ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ కేసులో జయలలిత తదితరులకు కోర్టు నాలుగేళ్ల జైలు, జరిమానా విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ జయలలిత, శశికళ తది తరులు దాఖలు చేసిన అప్పీళ్లను విచారించిన కర్ణాటక హైకోర్టు వారికి ఊరటనిస్తూ నిర్ధోషులుగా ప్రకటించింది. దీన్ని సవాలుచేస్తూ కర్ణాటక ప్రభుత్వం, డీఎంకే నాయకుడు అన్భళగన్‌లు సుప్రీంకోర్టులో విడివిడిగా అప్పీళ్లు దాఖలు చేశారు.




జయ పబ్లికేషన్స్‌కు సంబంధించి శశికళకు జయలలిత "జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ" (జీపీఏ) ఇచ్చారు. న్యాయపరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకే జయలలిత జీపీఏ ఇచ్చారు. జయ పబ్లికేషన్స్‌లోని తన అంటే జయలలిత ఖాతాలను శశికళ నిర్వహించేందుకు వీలుగానే జీపీఏ ఇవ్వడం జరిగింది. అంటే ఇద్దరూ తోడు దొంగలేనన్నమాట. ఈ నలుగురు నిందితులు అంటే జయలలిత తోకలిపి శశికళ, ఆమె కుటుంబ సభ్యులు వి.ఎన్‌.సుధాకరన్, జె.ఇళవరసిలు కుట్ర పూరితంగా వ్యవహరించారనేందుకు వారు ఏర్పాటు చేసిన మొత్తం 34 కంపెనీల్లో పది కంపెనీలు ఒకే రోజు ఏర్పాటు అయ్యయి అవే అన్నింటికి సాక్ష్యం.  ఆ కంపెనీల పేరిట శశికళ, సుధాకరన్‌లు ఆస్తులు కొనడం తప్ప, మరే వ్యాపార లావాదేవీ నిర్వ హించ లేదు. నామడు ఎంజీఆర్, జయ పబ్లికేషన్స్‌ కు కొనసాగింపు గానే ఈ కంపెనీలను ఏర్పాటు చేశారనేందుకు పక్కా ఆధారాలున్నాయి.




ఈ పది కంపెనీల నిర్వహణ మొత్తం జయలలిత ఇంటి నుండే జరిగినప్పుడు జయలలితకు ఈ వ్యాపారలావాదేవీలు ఏమాత్రం తెలియదని చెప్పడం ఆమోద యోగ్యం కాదు. అలాగే శశికళ తదితరులు కూడా ఆ కంపెనీల వ్యవహారాల గురించి తమకు తెలియదనడం సరికాదు. వాస్తవానికి జయలలితతో శశికళ తదితరులకు రక్తసంబంధం లేకపోయినా, వారంతా ఒకే చోట నివసించేవారు. తమకు వేర్వేరు ఆదాయ మార్గాలున్నాయని శశికళ తదితరులు చెబుతున్నప్పటికీ, జయలలిత ఇచ్చిన డబ్బు ద్వారానే వారు కంపెనీలను ఏర్పాటు చేసి, భారీ మొత్తంలో భూములు కొనుగోలు చేశారు అనేది వాస్థవిక సత్యం. జయలలిత తన ఇంట వారికి మానవతా దక్పథంతోనో, మరో కారణం తోనే ఉచిత వసతి కల్పించారు. కాబట్టి వారంతా కలిసే కుట్ర చేశారనేందుకు ఆధారాలున్నాయి. మూలధనం వాటా కింద 'శశి ఎంటర్‌ప్రైజెస్‌' కు జయలలిత కోటి రూపాయలు ఇచ్చిననట్లు జయలలిత ప్రతినిధి ఒకరు ఆదాయపు పన్ను శాఖ అధికారు లకు వెల్లడించారు. ఆ మొత్తాన్ని సెక్యూరిటీగా ఉంచి జయలలిత రుణం పొందారు. తరవాత వీరి వీరి ఖాతాల నుండి ధన ప్రవాహం విచ్చలవిడిగా జరిగిందనేందుకు వారి కుట్రను నార్త్‌ బీచ్‌ సబ్‌ రిజిష్ట్రార్, హార్టీకల్చరల్‌ అధికారి రాధాకష్ణన్‌ ఇచ్చిన సాక్ష్యాలు రుజువు చేస్తున్నాయి. అంతేకాక ఆస్తుల రిజిస్ట్రేషన్‌ సమయంలోనూ అధికార దుర్వినియోగం జరిగింది. నార్త్‌ బీచ్‌ సబ్‌ రిజిష్ట్రార్‌ను పోయెస్‌ గార్డెన్‌ కు పిలిపించి నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులను తక్కువ విలువకు, అదికూడా కొనుగోలుదారుల వివరాలు పొందుపరచకుండానే ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ప్రత్యేక న్యాయస్థానం ఈ విషయాన్ని పక్కాగా పరిగణనలోకి తీసుకుంది.

జయలలిత బ్రతికి ఉంటే మరణమే మంచిదనుకునేది. సుప్రీం తీర్పులో అంత డోసుంది. 

 


ఇక 1992లో జన్మదినం నాడు జయలలితకు అందిన రూ.2.15 కోట్ల విలువైన బహుమతులు, డబ్బును న్యాయమైన ఆదాయంగా భావించలేం అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకునే నలుగురు నిందితులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాక బ్యాంకుల్లో ఉన్న ఫిక్సిడ్‌ డిపాజిట్ల తాలుకు మొత్తాలు, ఇతర నగదు నిల్వలను జరిమానా మొత్తాల కింద జమ చేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా సబబైనవే. ఒకవేళ ఆ మొత్తాలు జరిమానాకు సరిపోకుంటే, బంగారు ఆభరణాలను వేలం వేసి ఆ మొత్తాలను జరిమానా నిమిత్తం జమ చేయాలని కూడా ఆదేశాలిచ్చింది. ప్రత్యేక కోర్టు చాలా జాగ్రత్తగా, లోతుగా అనేక అంశాలను పరి గణనలోకి తీసుకుని అంతిమ నిర్ణయానికి వచ్చింది.




అయితే హైకోర్టు మాత్రం పలు తప్పులను చేసింది. జయలలిత తదితరులు కేవలం 8.12% మేర మాత్రమే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని హైకోర్టు చెప్పింది. వాస్తవానికి ఇది ఎంత మాత్రం సరికాదు. తన ముందున్న ఆధారాలను, ఆదాయ వివరాలను లెక్కించడంలో చేసిన పొరపాటు వల్లే హైకోర్టు అటువంటి నిర్ణయానికి వచ్చింది. పబ్లిక్‌ సర్వెంట్‌ అవినీతికి ప్రైవేటు వ్యక్తులు సహకరిస్తే వారిని అవినీతి నిరోధక చట్టం కింద విచారించచ్చు. ఈ విషయంలో ప్రత్యేక కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు సరైనవే. అవినీతి నిరోధక చట్టం కింద నిందితులందరూ నేరం చేశారని ప్రత్యేక కోర్టు చెప్పడంలో ఎటువంటి తప్పులేదు, అని ధర్మాసనం తన తీర్పులో వివరించింది.


గతంలో దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు జీవనం గడిపినప్పుడు ఎ-కేటగిరీతో కూడిన వసతులను ఆమెకు కల్పించారు. అయితే చిన్నమ్మకు ప్రత్యేక వసతులు కల్పించకూడదని న్యాయవాదులు తెలిపారు. చిన్నమ్మకు అందరికీ ఇచ్చే కామన్ రూమే ఇవ్వాలన్నారు. ఈ తీర్పు ప్రతిలో న్యాయవాదులు తీవ్రపదజాలాన్ని ఉపయోగించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన నేరస్థులపై సుప్రీం ఫైర్ అయ్యింది.


'శిక్ష పడుతుందనే భయం కూడాలేని లెక్కలేనితనం పెరిగిపోతోంది. లాభదాయక ప్రతిఫలాలను ఆశిస్తూ... సామాజిక భావ జాలంపై పట్టుసాధిస్తున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న, ఊపిరాడనివ్వకుండా ప్రాణాలు తీస్తున్న ఈ బహిరంగ అవినీతిని ప్రజా బాహుళ్యం నుంచి తరిమికొట్టేందుకు అన్ని దశల్లో వ్యక్తిగతంగా, సమిష్టిగా జోక్యం చేసుకోవటం అనివార్యం' అని జస్టిస్‌ రాయ్‌ వ్యాఖ్యానించారు. 
 
'అక్రమ మార్గాల ద్వారా సంపద పోగేసుకోవాలనుకునే దురాశపరులు రాజ్యాంగానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. సమాజంలో చెలరేగిపోతున్న అవినీతి ఆందోళన కలిగిస్తోంది' అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమితవ్‌ రాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపరుల్లో అపరాధ భావం కూడా కనిపించడంలేదని, శిక్ష పడుతుందనే భయం కానరావటం లేదని తెలిపారు. సమాజంలో ఇలాంటివారిదే పైచేయి అవుతుండటంతో నిజాయితీపరులు దిక్కుతోచని వారవుతున్నారని జస్టిస్‌ అమితావ రాయ్‌ తెలిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: