ప్రస్తుతమున్న మీడియా ఆధిపత్యానికి చెక్ - సోషల్ మీడియా: కోదండరాం



ప్రొఫెసర్ కోదండరాం ఇప్పటికి సరిగ్గా మాట్లాడారు. మీడియాని గుప్పెట్లో పెట్టుకొని అటు అంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణా లోను మేజర్ మీడియసను స్వంతం చేసుకొని అధికార పార్తీలు ప్రజాలకు అందవలసిన వార్తలను ఆయా పార్టీల ప్రయోజనా లకు తగినట్లు వార్తల ముద్రణ జరుగుతుందే తప్ప నిజాల నిగ్గు తేల్చటం జరగట్లేదు. 



"ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలు సమాచారాన్ని ఎడిట్‌ చేస్తూ ప్రజలకు అర్థం అయ్యీ, కాని రీతిలో ప్రసారం చేస్తు న్నాయి. మీడియా సంస్థలన్నీ కొందరి చేతుల్లోనే ఉండటం వల్ల మన కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ప్రజలకు చేరడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్‌ మీడియా పట్ల నైపుణ్యాలను పెంపొందించుకుని మన లక్ష్యాలను ప్రజలకు చేరే వేసే విధంగా చూసు కోవాలి" అని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ అన్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలోని వైష్ణవి హోటల్‌లో "సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌" పై ఏర్పాటు చేసిన 'ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌' ను ఆయన ప్రారంభించారు.



ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ, సమాజంలో ప్రస్తుతం 35 నుంచి 40 శాతం వరకు సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారని, తెలంగాణలో కోటి మందికి పైగా సోషల్‌ మీడియాలో ఉన్నారని, అందువల్ల సోషల్‌ మీడియా ప్రాధాన్యతను గుర్తించి జేఏసీ కార్యక్రమాలకు మరింత ప్రచారం కల్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం వార్తా సంస్థలకంటే సోషల్‌ మీడియా లోనే సమాచారం వేగంగా అందుతున్నదని పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా మాత్రమే ఉండేదని, ఇప్పుడు సమాజంలో సోషల్‌ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తున్నదన్నారు. వ్యక్తులుగాకానీ, సంస్థలుగాకానీ తలపెట్టిన కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరాలంటే సోషల్‌ మీడియాను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవ సరం ఉందని అన్నారు.




ప్రజాసమస్యలే ఎజెండాగా పోరాడుతోన్న టీజేఏసీ కూడా సోషల్‌ మీడియా వినియోగంపై దృష్టిపెట్టిందని, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, వాట్సప్‌, బ్లాగ్‌, వెబ్ బసెద్ న్యూస్ సైట్స్ తదితర మాద్యమాలను ఉపయోగించు కుంటున్నదని తెలిపారు. ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావడానికి ఫిబ్రవరి మూడవవారంలో తెలంగాణ నిరుద్యోగ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వ హించనున్నట్లు కోదండరామ్‌ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జిల్లాల కన్వీనర్లు, ఛైర్మన్లు, కో-చైర్మన్లు తదితరులు పాల్గొని తమతమ అభి ప్రాయాలను వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: