అమెరికా - భారత (విదేశీ) ఐటీ ఉద్యోగులకు మరో షాక్‌!

అనుకున్నంతా అవుతుంది. ట్రంప్ ప్రతిపాధనలు అమలు అయ్యేదిశగా పావులు కదుపుతుంది అమెరికా. ఇక అమీరుపేటలో చదువుకొని హెచ్ 1బి ప్రయత్నించటం కుదరదు. అమెరికా భారత సమాచార సాంకేతిక (ఐటీ) వర్గాలకు మరోబలమైన షాకి వ్వ నుంది. గతంలో అనుకున్నట్లే హెచ్‌1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేస్తూకీలక బిల్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి చట్ట బద్ధత తెచ్చే దిశగా సెనేటర్లు "చుక్‌ గ్రాస్లే, రిచర్ద్ డర్బన్‌" తగిన సన్నాహాలు చేస్తున్నారు.



దీని ప్రకారం అమెరికా విశ్వ విద్యాలయాల్లో చదివిన విదేశీయులకే హెచ్‌1బీ వీసాల జారీలో తొలి ప్రాధాన్యం ఇస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పట్టభద్రులు, అధిక వేతనం పొందే నిపుణులకు కూడా అవకాశం ఇస్తారు. దీనర్థం అమెరికన్ సాంకెతిక వ్యవస్థల్లో అధిక నైపుణ్యాన్ని కలిగిన వారిని విశ్వవిధ్యాలయాల్లో మాత్రమే చదివిన పట్టభద్రులైన వారికి ప్రాధాన్యత క్రమం లో హెచ్ 1 బి విసాల జారీ జరుగుతుంది.  



‘అమెరికాలో అత్యున్నత స్థాయి శ్రామికశక్తిని నింపడానికే ఈ ప్రతిపాదన. దురదృష్టవశాత్తూ ఇక్కడి కంపెనీలు అమెరికన్లను కాదని తక్కువ వేతనానికి వస్తున్న విదేశీయులను తెచ్చుకొంటున్నాయి.  విదేశీ నిపుణులకోసం  బయటి ఉద్యోగుల కంటే ఇక్కడ చదివిన వారికే మొదట అవకాశం కల్పిస్తాం’ అని సెనేటర్లు వెల్లడించారు. అలాగే 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు న్న ఔట్‌సోర్స్‌ కంపెనీలు అదనంగా పరిదికి మించి హెచ్‌1బీ/ఎల్‌1 వీసాలున్నవారిని నియమించుకోవడానికి కూడా నిబంధనలు అనుమతించవు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: