ఒబామా స్థానం లోకి మోడీ - ఇక మన మోడీనే నంబర్ వన్


సోషల్ మీడియాలో అద్భుతమైన అనుచరులున్న బరాక్‌  ఒబామా అమెరికా అధ్యక్ష పదవీకాలం ముగియటంతో ఆయన స్థానానికి బ్రేక్ పడ్డట్టే.  కాలపరిమితి ముగియడం తో అమెరికా అధ్యక్ష పదవి నుంచి నిష్క్రమిస్తున్న బరాక్‌ ఒబామా, మరో ఘనతనూ కోల్పోబోతున్నారు. ఇన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో అత్యధిక సంఖ్యలో ఫాలోయర్లను కలిగి ఉన్న దేశాధినేతగా ఒబామా నిలిచిన సంగతి తెలిసిందే.



కానీ, శనివారం నుంచి ఆయన దేశాధినేత కాదు కాబట్టి, ఆయన తర్వాత రెండోస్థానంలో ఉన్న మన ప్రధాని మోదీ ఆటోమేటిగ్గా అగ్రస్థానంలోకి వచ్చేస్తారు.



ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విటర్‌, గూగుల్‌ ప్లస్‌, ఇలా అన్నింటినీ కలుపుకొంటే నంబర్‌ వన్‌ ఆయనే అనే పీఎంవో అధికారులు చెబుతున్నారు. మోదీని ట్విటర్‌లో సుమారు 3 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 4 కోట్ల మంది, గూగుల్‌ ప్లస్‌లో 32 లక్షల మంది, లింక్‌డ్‌ఇన్‌లో 20 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 58 లక్షల మంది, యూట్యూబ్‌లో 6 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.

ఇక, మోదీ మొబైల్‌ యాప్‌ను కోటి మందికి పైగా డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. ఒక రాజకీయనాయకుడికి సంబంధించి ప్రపంచంలో అత్యంత విస్తృతంగా వాడుతున్న యాప్‌ ఇదే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: