వేశ్యలకు రేటింగ్ ఇచ్చే ఉద్యోగముంది.. చేస్తారా..!?

Chakravarthi Kalyan
మార్కెట్లో ఏ వస్తువు కొనాలన్నా ఒ కటికి రెండు సార్లు ఆలోచిస్తాం.. మనం పెడుతున్నసొమ్ముకు తగిన ఫలితం దక్కుతుందా లేదా అని ఆలోచిస్తాం. ఇప్పుడు ఇంటర్ నెట్ వచ్చాక దేనిగురుంచైనా నెట్లో వెదికేయడమే. ఆ వస్తువు రేటింగ్ చూడటం.. పాత కస్టమర్ల అభిప్రాయాలు చదవడం ద్వారా ఓ అభిప్రాయానికి వస్తున్నాం.. ఇదే పద్దతి వేశ్యలకూ ఉంటే బావుంటుంది కదా అని ఆలోచించిందో సంస్థ.

మన దేశంలో వ్యభిచారం నేరం. కానీ చాలా దేశాల్లో అదో చట్టబద్దమైన వ్యాపారం. మరి వ్యాపారం అన్నాక కస్టమర్ ను శాటిస్ ఫై చేయడమే కదా వ్యాపార రహస్యం. అందుకే వేశ్యలకు కూడా రేటింగ్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించిందో కంపెనీ.. ఆలోచన రావడమే తడవుగా ఓ ఉద్యోగ ప్రకటన వెలువరించింది. ఇప్పుడది అంతర్జాలంలో హాట్ టాపిక్ అయ్య కూర్చుంది. 

ఇప్పుడు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ కాగానే.. ముందుగా చేసే పని రివ్యూలు చదవడం.. ఒక వెబ్ సైట్ రివ్యూతో శాటిస్ ఫై అవ్వకుండా.. ముడు నాలుగు వెబ్ సైట్లు చూసి అప్పుడు కానీ ఓ అభిప్రాయానికి రావడంలేదు. ఇక్కడా సేమ్ ప్రిన్సిపుల్. వేశ్యలను అనుభవించడం.. వారి పనితనంపై రేటింగ్ ఇవ్వడమే ఈ సరికొత్త ఉద్యోగం. ఉద్యోగం పేరు ప్రాస్టిట్యూట్‌ టెస్టర్‌.
 
సినిమా రివ్యూ రాసినట్టు వేశ్యలను అనుభవించి వారికి రేటింగ్ ఇవ్వాలి. వారి ప్రత్యేకతలేంటో వివరిస్తూ ఆర్టికల్స్ రాయాలి. ఇదీ ఉద్యోగం.. జర్మనీకి చెందిన కౌఫ్‌మచ్‌ డాట్‌కామ్‌ అనే వెబ్‌సైట్‌ ఈ ప్రకటన ఇచ్చింది. అలాగని ఈ ఉద్యోగం ఒక్క మగాళ్లకే పరిమితం కాదండోయ్. మగ వేశ్యలను పరీక్షించే ఆడ టెస్టర్లు కూడా కావాలట. ఈ ఉద్యోగానికి కొన్ని అర్హతలు కూడా కేటాయించారు. అన్నింటికన్నా ప్రధానం సెక్స్ బిజినెస్ ను అభివృద్ధి చేయాలన్న తపన ఉండటం మాత్రం తప్పనిసరట. మరి మీరూ ట్రై చేస్తారా..!?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: