కాంగ్రెస్ కి ఇండియన్ ఆర్మీ షాక్! 2016 కు ముందు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదు.

భారత సైన్యానికి దాని సామర్ధ్యానికి, ఆత్మస్తైర్యానికి రాజకీయ నాయకులు తమ వ్యాఖ్యలతో అప్పుడప్పుడు హాని కలిగిస్తూనే ఉన్నారు. ఆ పరంపరలోనే కాంగ్రెస్ ఈ మధ్య గతం లోనూ అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోను భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని వ్యాఖ్యలు చేసింది 


ఉరి ఘటన తర్వాత తొలిసారిగా 2016 సెప్టెంబర్ లోనే సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించామని భారత్ ఆర్మీ నార్త్ కమాండ్ - జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ వాదనపై నీళ్లు చల్లినట్లయ్యింది. తమ హయాంలో ఆరు సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ శుక్లా ఇటీవల అన్నారు.  అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడలేదని ఇంత కాలం పార్టీ పెద్దలు చెప్పారు. 


అయితే ఇప్పుడు తాజాగా లెఫ్టినెంట్ జనరల్ రణ్ బీర్ సింగ్ ప్రకటనతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించి భారత్ ఆర్మీ తరపున మాట్లాడిన లెఫ్టినెంట్ జనరల్ రణ్ బీర్ సింగ్ 2016 సెప్టెంబర్ లోనే తొలి సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని తెలిపారు. అలాగే రాజకీయ పార్టీలు ఏం చెబుతాయనేది తమకు అనవసరమని తెలిపారు. అలాగే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ను గొప్ప విజయమని సింగ్ తన వ్యాఖ్యల్లో పేర్కొన్నారు. పాక్ గడ్డ పై ఉగ్రవాదులను మట్టుబెట్టడం ద్వారా ఉగ్రవాదులకు శత్రు దేశానికి బలమైన సంకేతాలు ఇచ్చామని అన్నారు.

సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఉగ్రవాదులకు భారత జవాన్ల శక్తి ఏంటో తెలిపామని అన్నారు. అలాగే ఉరి ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడులకు సరైన సమాధానం చెప్పామని అన్నారు. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై 2016 సెప్టెంబర్ లో సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. అయితే ఈ దాడిలో దాదాపు 40 మంది ఉగ్రవాదులు చని పోగా, ఏడు ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం అయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: