అధికారంరాదు అనే అనుమానానికే ఆయన అసహన సార్వబౌముడైతే ఎలా?

ఎన్నికలు ప్రారంభమైన క్షణానికి ముందు నుంచే టిడిపి అధినేత ఏపి సీఎం చంద్రబాబు అగ్నిగోళాన్ని తలపిస్తున్నారు. నాడు సుయోధనుడు పాండవ పక్షంలోని ధనుంజయుణ్ణి ఎదుర్కోవటానికి కర్ణుణ్ణి ఏరికోరి సిద్ధం చేసుకున్న తరహాలో తన ప్రయత్నాలను అధికార అందలం ఏమాత్రం అందకపోయినా మొత్తం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి అరాచకం సృష్టించైనా అధికార సింహపీఠిని వదలకూడదని అనూకున్నట్లున్నారు.


అదే స్టాండ్ తో తన పచ్చ మీడియా సహాయంతో  ఒక వెలిసి పోయిన సొంటినేని శివాజి అనే (అప) హాస్య నటుణ్ని ఎన్నుకొని ఆయనతో గరుడ, ద్రవిడ, కుమార, రాక్షస అంటూ ఏవో పిచ్చి కథలు చెప్పించారు. తద్వారా దక్షిణ భారతాన్ని విభజించి తానే సార్వభౌముడవ్వాలన్న కసితో  దేశ ప్రజల్లో ద్వైధీ  భావన పుట్టించాలని ప్రయత్నిచారు. అది కాస్తా తుస్సు మంది - ఆ నటుడు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే ఆయన  ఆచూకి ఇప్పుడు దొరకట్లేదని తెలుస్తుంది. అలాగే 'ఈ కథ బుల్లి తెరపై తెల్ల బోర్డులపై చూపిన టివి 9' చేతులు మారింది.

ఈ కథ నడిపించిన దర్శక శిఖామణి అదే సామాజిక వర్గానికి చెందిన రవి ప్రకాష్ దీనావస్థ ప్రతిదినం వార్తలు అనుసరించే వారికి తెలియంది కాదు. చివరకు అంతా బెడిసి కొట్టగా ఈ మొత్తానికి నిర్మాతగా ఉన్నారంటున్న చంద్రబాబు అభాసు పాలయ్యారని చెప్పక తప్పదు. 


ఇక మిగిలిన అరాచకంలో భాగాలే ఇవి:  


*ఒక ప్రక్క బిజేపి పైన బురద చల్లటం
*మరో పక్క వైసిపి పైన దానికి సహకరించారన్న కేసీఆర్ పైన దుమ్మెత్తి పోయటం
*ఇంకో పక్క ఎన్నికల సంఘం, దాని అధికారుల తీరు పై ఆయన అసహనం ఆగ్రహం బెదిరింపులు 
*వైసిపికి ఓటింగ్ బాగా జరిగిందనే ప్రచారానికి కలవరపడి వెర్రెత్తి పోవటం  
*దానికి తోడు తన ఓటు సైకిలుకి వేస్తే ఫ్యానుకి పడిపోయిందంటూ మానసిక సమతౌల్యత తప్పిన విధంగా సంచలన వ్యాఖ్యలు ఒక సిఎంగా చంద్రబాబు చేశారు. 
*ఈవీఎం లు గోల్ మాల్ చేసినా తమ పార్టీ 130 స్థానాల్లో విజయం సాధిస్తుందని మరో ప్రకటన చేసి క్యాడర్ ను సంతృప్తి పరచ ప్రయత్నించటం  
*దేశవ్యాప్తంగా 21 రాజకీయ పక్షాలతో కలసి వివిప్యాట్ లను 50 శాతం లెక్కించాలంటూ దేశ వ్యాప్తంగా లొల్లి చేయటం న్యాయస్థానాల్లో పోరాటం చేసి తిరస్కరనకు గురవ్వటం. ఆఖరకు మళ్ళీ ఎన్నికల సంఘాన్ని దేబిరించటం
*ఇంకా కౌంటింగ్ లో ఏదో చేయాలని చూస్తున్నారు అనే అపప్రధను సృష్టించటం  


ఈ వ్యాఖ్యలు టిడిపి శిబిరంలో కూడా గందర గోళం రేకెత్తించాయి. కార్యకర్తలు ఇతర టిడిపి నాయకులు జరిగిన డ్యామేజ్ దృష్టికి తేవటంతో పరిస్థితులు గమనించిన చంద్రబాబు వెంటనే తేరుకుని తన సమీక్షల్లో తనవారిని శాంతింపజేయటానికి మనమే గెలుస్తున్నాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కటం. ఇదంతా చూస్తుంటే ఒకనాడు తన వారి చేత అపరచాణక్యుడు అనిపిలిపించుకొని చివరికి అధికారం దక్కదేమో అనే అనుమానంతో కొంత అసమగ్ర మానసిక అసంతృప్తితో భారత రాజ్యాంగ వ్యవస్థలు మొదలు కొని క్రింది స్థాయి ఉద్యోగుల వరకు ఆసేతు శీతాచలం మింటిని మన్నుని కలిపేసి పరిస్థితులని అఘాధం చేయటం చంద్రబాబు లోపల ఏం జరుగుతుంది? అనే అనుమానం చూపరులందరికీ కలిగించటం ఇప్పుడు అవసరమా? అధికారం లేకపోతే బ్రతకలేనేమో? అన్నంత ఆఖరి పోరాటానికి సిద్ధమవటం చూస్తుంటే చాల విచిత్రంగా కనిపిస్తుంది. 

ప్రశాంతంగా ఉండే ఏపి — ఈ  ఎన్నికల్లో అల్లకల్లోలం చెలరేగి  అరాచకం అనుభవించింది. ఇది ఎటుబోయి ఎటుదారి తీస్తుందో, అన్న భావన ప్రతిపక్షానికి కూడా కలిగింది. ఒక వ్యూహం ప్రకారం టిడిపి అధినేత సాగించిన ఈ వికృత కార్యక్రమాలతో  వైసిపి అప్రమత్తం అయ్యింది.  ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యూహకర్తలు కౌంటింగ్ లో అధికారపార్టీ సృష్టించబోయే అవాంతరాలను ధీటుగా ఎదుర్కోవటానికి తమ పార్టీ క్యాడర్ సిద్ధం చేసింది. ఈరోజే ఎపి రాజధాని అమరావతిలో రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ శిక్షణనను రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు. చివరి ఈవిఎం లెక్కించే వరకు వైసిపి ఏజెంట్లు ఈవీఎంలను ఎట్టి పరిస్థితుల్లో వదిలి రాకూడదని ఇప్పటికే కౌంటింగు సమయంలో అనుసరించే ప్రధాన అంశాల్లో చేర్చారు. టిడిపి పోటీలో వెనుకబడినప్పుడు గందరగోళం సృష్టిస్తే సంయమనంతో ఎలా వ్యవహరించాలి ? ఎన్నికల నిబంధలనలను పాటిస్తూ ఫిర్యాదులు చేయడం వంటి వాటిపై శిక్షణ అందించనుంది వైసిపి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: