గ్రౌండ్ రిపోర్ట్ : జమ్మలమడుగు ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవొచ్చు ...!

Prathap Kaluva

జమ్మలమడుగు ఈ నియోజకవర్గం ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు.  రేపుతున్న నియోజకవర్గాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున నిలబడి విజయం సాధించిన ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో ఈ నియోజకవర్గంలో మరో ప్రత్యామ్మాయ నేత సుధీర్ రెడ్డికి అవకాశం ఇచ్చింది వైసీపీ. ప్రస్తుతం సుధీర్ రెడ్డి పార్టీ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. టికెట్ దక్కించుకున్న సుధీర్ రెడ్డి గ్రామగ్రామన తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అనుకూలించే విషయాలు: నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉండడం. గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం. జగన్పై ఉన్న ఇమేజ్ కలిసి వస్తుందన్న ఆశాభావం. ప్రతికూలించే విషయాలు: తొలిసారి పోటీ చేస్తుండడం. ప్రత్యర్థి బలంగా ఉండడం. 


గత ఎన్నికల్లో విజయం సాధించిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడంతో టికెట్ ఎవరికి వస్తుందోనని సస్పెన్స్ కొనసాగింది. చివరికి టీడీపీలో ఆదినుంచి పనిచేసుకుంటూ వచ్చిన రామసుబ్బారెడ్డికే చంద్రబాబు టికెట్ కేటాయించారు. రామసుబ్బారెడ్డి జమ్మలమడుగులో సీనియర్ నేత కావడం.. బలమైన కార్యకర్తలు ప్రజాబలం ఉండడంతో తిరుగులేకుండా ఉన్నారు. ఇక రామసుబ్బారెడ్డి ఆదినారాయణరెడ్డి  మధ్య గత కొంతకాలంగా ఉన్న వైరాన్ని చంద్రబాబు సద్దుమణిగేలా చేశారు.అనుకూలించే విషయాలు: రామసుబ్బారెడ్డికి ప్రధానంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండడం కలిసి వచ్చే అంశం.. ఎంతోకాలంగా వైరంగా ఉన్న ఆదినారాయణరెడ్డి  సొంత టీడీపీ పార్టీలోనే ఉండడం.


పార్టీ క్యాడర్ బలంగా ఉండడం అనకూలిస్తోంది. ప్రతికూలించే విషయాలు: వరుసగా మూడుసార్లు ఓటమి పాలవ్వడం. రామసుబ్బారెడ్డికి ఆదినారాయణ రెడ్డి వర్గం ఎంతవరకు సహకరిస్తాడనే అనుమానాలు.  ప్రస్తుతం జమ్మలమడుగు రాజకీయాలను గమనిస్తే వైసీపీతో పోల్చితే టీడీపీ బలంగా ఉంది. రామసుబ్బారెడ్డి ఆదినారాయణరెడ్డిలు ఒకే ఒరలో రెండు ఫ్యాక్షన్ కత్తులు లాగా ఇమిడిపోయి ఉన్నారు. అవి సహకరించుకుంటే విజయం.. లేదంటే తేడా కొట్టవచ్చు. ఇక వరుసగా ఓడిపోయిన రామసుబ్బారెడ్డిపై ప్రజల్లో సానుభూతి కలిసివస్తుంది. వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఈ ఇద్దరు రాజకీయ ఉద్దండులను తట్టుకొని వైసీపీ గాలిలో కొట్టుకువస్తే ఆశ్చర్యమే మరి.. జగన్ వైసీపీ వేవ్ పనిచేస్తే ఆయనే గెలుపు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: